Digital Lottery: రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్.! డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం.

|

Sep 15, 2024 | 12:23 PM

మీరు మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారా. అయితే ఈ లాటరీ గురించి తెలుకోండి. ఎందుకంటే ఈ లాటరీ ద్వారా ఏకంగా రూ.50 కోట్లను గెల్చుకునే ఛాన్స్ ఉంది. దీనిని మొదటిసారిగా డిజిటల్ విధానంలో ప్రారంభించడం విశేషం. మేఘాలయా ప్రభుత్వం ఇటివల కీలక ప్రకటన చేసింది. ఈ క్రమంలో ఆన్‌లైన్ లాటరీని ప్రారంభించింది. ఇది భారతదేశపు మొట్టమొదటి పూర్తి డిజిటల్ లాటరీ. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ప్రకటించారు.

మీరు మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారా. అయితే ఈ లాటరీ గురించి తెలుకోండి. ఎందుకంటే ఈ లాటరీ ద్వారా ఏకంగా రూ.50 కోట్లను గెల్చుకునే ఛాన్స్ ఉంది. దీనిని మొదటిసారిగా డిజిటల్ విధానంలో ప్రారంభించడం విశేషం. మేఘాలయా ప్రభుత్వం ఇటివల కీలక ప్రకటన చేసింది. ఈ క్రమంలో ఆన్‌లైన్ లాటరీని ప్రారంభించింది. ఇది భారతదేశపు మొట్టమొదటి పూర్తి డిజిటల్ లాటరీ. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ప్రకటించారు. ఇందులో ఎవరైనా సరే 50 కోట్ల రూపాయల వరకు బహుమతిని గెలుచుకోవచ్చు. ఈ లాటరీని నిర్వహించే నిర్ణయాన్ని అభినందనీయమైన చర్యగా ముఖ్యమంత్రి కాన్రాడ్ అభివర్ణించారు. ఈ లాటరీలో పాల్గొన్న వారు కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ ఉంది. ఈ లాటరీ మొదటి విజేతకు రూ.50 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు.

లాటరీ వల్ల నష్టపోయే ప్రమాదం లేదన్నారు ముఖ్యమంత్రి సంగ్మా. చట్టవిరుద్ధమైన బెట్టింగ్‌లు తగ్గించడానికి చేసే ప్రయత్నమే అన్నారు. అయితే సాధారణంగా లాటరీని ఏదైనా దుకాణం, మార్కెట్, బస్టాండ్, పోస్టాఫీస్, సర్వీస్ సెంటర్లలో కొనుగోలు చేస్తారు. కానీ మేఘాలయ ప్రభుత్వం దీన్ని ఆన్‌లైన్‌లో పెట్టింది. easylottery.in ని సందర్శించి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చని సీఎం అన్నారు. ఆ తర్వాత తీసిన డ్రాలో ఎవరు ఎంపికైతే వారికి ఆ లాటరీ మొత్తాన్ని అందించనున్నట్లు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on