Beggar Property: కోటీశ్వరుడిగా మారిన బిచ్చగాడు.. సిటీలో కాస్ట్లీ ల్యాండ్.!

Updated on: Jan 24, 2024 | 5:54 PM

బీహార్‌లోని పాట్నాకు చెందిన పప్పు అనే బిచ్చగాడు యాచించిన సొమ్ముతోనే శ్రీమంతుడిగా మారాడు. నగరంలోని పలు చోట్ల భూమిని కొనుగోలు చేశాడు. ఓ ప్రముఖ ప్రైవేట్‌ పాఠశాలలో తన ఇద్దరు పిల్లలను చదివిస్తున్నాడు. సొంతింట్లోనే ఉంటూ తన యాచక వృత్తిని కొనసాగిస్తున్నాడు. ‘చిన్నప్పుడు బాగా చదవడం లేదని కుటుంబసభ్యులు తనను కొట్టేవారనీ దీంతో ముంబయికి పారిపోయాననీ చెప్పుకొచ్చాడు.

బీహార్‌లోని పాట్నాకు చెందిన పప్పు అనే బిచ్చగాడు యాచించిన సొమ్ముతోనే శ్రీమంతుడిగా మారాడు. నగరంలోని పలు చోట్ల భూమిని కొనుగోలు చేశాడు. ఓ ప్రముఖ ప్రైవేట్‌ పాఠశాలలో తన ఇద్దరు పిల్లలను చదివిస్తున్నాడు. సొంతింట్లోనే ఉంటూ తన యాచక వృత్తిని కొనసాగిస్తున్నాడు. ‘చిన్నప్పుడు బాగా చదవడం లేదని కుటుంబసభ్యులు తనను కొట్టేవారనీ దీంతో ముంబయికి పారిపోయాననీ చెప్పుకొచ్చాడు. రైల్వే స్టేషన్‌లో నిల్చున్న తనను చూసి బిచ్చగాడిగా భావించి ప్రజలు డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారనీ రెండు గంటల్లోనే చేతికి రూ.3,400 వచ్చిందని అన్నాడు. మరుసటి రోజు అదే స్థలానికి వెళ్లి కూర్చుని మళ్లీ సంపాదించాననీ అదే అలవాటుగా మారిందని తెలిపారు. ఆ తర్వాత పాట్నాకు తిరిగి వచ్చి భిక్షాటన చేయడం ప్రారంభించా అని పప్పు చెప్పాడు. ‘‘తన ఇద్దరు పిల్లలు ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో చదువుతున్నారు. యాచించిన సొమ్ముతోనే తన పిల్లలను అధికారులుగా తీర్చిదిద్దుతాను’’ అని పప్పు చెప్పాడు. పప్పుకు ఐదు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి. పట్నాలో భిక్షాటన చేసి కోటీశ్వరుడయ్యాడని అతడి స్నేహితుడు మరో బిచ్చగాడు విశాల్‌ తెలిపాడు. తాము కూడా బిక్షాటన చేసి కోటీశ్వరులయ్యాం అన్నాడు. అయితే డబ్బంతా వృథా చేసుకున్నట్లు చెప్పాడు. పప్పును కరోడ్‌పతి పప్పు అని అందరూ పిలుస్తారని భిక్షాటనను అరికట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా పప్పు మాత్రం భిక్షాటనతోనే కోటీశ్వరుడయ్యాడని విశాల్‌ చెప్పాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos