దిగంబర ముఠా అరాచకాలు.. గ్రామాల్లో నగ్నంగా తిరుగుతూ

Updated on: Sep 08, 2025 | 9:31 PM

రోజు రోజుకూ మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో దిగంబర ముఠా మహిళలపై దాడులకు పాల్పడటం కలకలం రేపుతోంది. మీరట్‌ జిల్లాలో గత కొన్ని రోజులగా కొంతమంది పురుషులు నగ్నంగా తిరుగుతున్నారని, ఒంటరిగా కనిపించిన మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

భారాలా గ్రామంలో ఇటీవల ఓ మహిళ ఒంటరిగా ఆఫీసుకు వెళ్తుండగా, నిర్మానుష్య ప్రదేశంలో దిగంబర ముఠాకు చెందిన వ్యక్తులు ఆమెను పొలాల్లోకి లాక్కెళ్లడానికి ప్రయత్నించారు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. ఇదే తరహాలో ఇదివరకే నాలుగు దాడులు జరిగాయని గ్రామస్తులు తెలిపారు. స్థానికంగా ముగ్గురు మహిళలు ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్నప్పటికీ భయం, అవమానంతో ఇంతవరకు బయటకు చెప్పలేకపోయారని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. అయితే పరిస్థితి చేయి దాటడంతో పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. పలు గ్రామాల్లో ప్రజలు ఈ ముఠాను చూశామని చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటివరకు అనుమానితులను గుర్తించలేదని, అటవీ ప్రాంతాల్లో డ్రోన్ల సహాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. గ్రామాల్లో పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏఐ రంగంలో ఉద్యోగాలు కావాలా? ఓపెన్ ఏఐ సంచలన ప్రకటన

శక్తిపీఠంలో తెగిన రోప్‌వే.. ఆరుగురు దుర్మరణం

ఛాతిలో కత్తి.. అలాగే పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాలుడు.. పోలీసులు షాక్

భారీ వరదలో చిక్కుకున్న బస్సులు.. భయంతో ప్రయాణికుల ఆర్తనాదాలు

చిట్టీలు కడుతున్నారా? ఇలాంటివారు ఉంటారు.. తస్మాత్ జాగ్రత్త