వర్షంతో నీటమునిగిన రోడ్డు.. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఏం చేశాడో తెలుసా ??

|

Jul 18, 2024 | 7:15 PM

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. ఈ క్రమంలో వర్షం నీటిలో నడిచి వెళ్తే తన బట్టలు తడుస్తాయని భావించిన ఒక మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ చేసిన పని నెటిజన్లను ఆగ్రహానికి గురిచేస్తోంది. కాలేజ్‌ ఆవరణ మొత్తం వరదనీటితో నిండిపోవడంతో ఆయన బట్టలు తడిచిపోతాయని మెడికల్‌ కాలేజ్‌ సిబ్బంది ప్రిన్సిపాల్‌ను స్ట్రెచర్‌పై కూర్చొబెట్టుకుని బయటకు తీసుకెళ్లారు.

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. ఈ క్రమంలో వర్షం నీటిలో నడిచి వెళ్తే తన బట్టలు తడుస్తాయని భావించిన ఒక మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ చేసిన పని నెటిజన్లను ఆగ్రహానికి గురిచేస్తోంది. కాలేజ్‌ ఆవరణ మొత్తం వరదనీటితో నిండిపోవడంతో ఆయన బట్టలు తడిచిపోతాయని మెడికల్‌ కాలేజ్‌ సిబ్బంది ప్రిన్సిపాల్‌ను స్ట్రెచర్‌పై కూర్చొబెట్టుకుని బయటకు తీసుకెళ్లారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో జరిగింది. ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో షాజహాన్‌పూర్‌లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రి కూడా నీట మునిగింది. ఈ నేపథ్యంలో తన కారు వద్దకు నీటిలో నడిచి వెళ్లేందుకు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌ రాజేష్ కుమార్‌ సంశయించారు. దుస్తులు నీటిలో తడవకుండా ఉండేందుకు స్ట్రెచర్‌పై బయటకు వెళ్లారు. ఒక స్ట్రెచర్‌పై ఆయన కూర్చోగా సిబ్బంది దానిని లాక్కెళ్లారు. రాజేష్ కుమార్‌ బ్యాగ్‌, ఇత్తర వస్తువులను కూడా మరో స్ట్రెచర్‌పై తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అతను తన ముఖం కనిపించకుండా ఉండేందుకు కర్చీఫ్‌ అడ్డుగా పెట్టుకునే ప్రయత్నం చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రెండు రోజులుగా పనిచేయని లిఫ్ట్‌.. తెరిచి చూస్తే షాక్‌ !!

 

Follow us on