పండుగ కోసం ఊరెళ్లిన కుటుంబం.. తిరిగి వచ్చేసరికి ఇంట్లో..

Updated on: Jan 24, 2026 | 1:29 PM

మేడ్చల్ జిల్లాలోని పోచారం ఐటీ కారిడార్‌లోని సంస్కృతి టౌన్‌షిప్‌లో అర్ధరాత్రి దొంగతనం జరిగింది. సంక్రాంతి పండుగకు స్వగ్రామానికి వెళ్లిన ఇంటి యజమాని పవన్ కుమార్ ఇంట్లో దొంగలు చొరబడి సుమారు 5 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, అమెరికన్ డాలర్లను అపహరించారు. పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో టౌన్‌షిప్ వాసులు భయాందోళనలో ఉన్నారు. భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు రెచ్చిపోయారు. సంస్కృతి టౌన్‌షిప్‌లో అర్ధరాత్రి సమయంలో జరిగిన దొంగతనం కలకలం రేపింది. టౌన్‌షిప్‌లోని A బ్లాక్, A33 ఫ్లాట్‌ను అర్ధరాత్రి దొంగలు చొరబడ్డారు. ఈ ఘటనలో సుమారు రూ.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో పాటు అమెరికన్ డాలర్లను దొంగలు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఇంటి యజమాని పవన్ కుమార్ సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామానికి వెళ్లారు. పండుగ అనంతరం తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు పగలగొట్టి, లోపల ఉన్న వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండటంతో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోచారం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. అక్కడి సీసీ పుటేజీని పరిశీలించిన పోలీసులు.. ప్రాథమిక దర్యాప్తులో దొంగలు ఐదు ఇళ్లలో దొంగతనానికి ప్రయత్నించగా, ఒక ఇంట్లో మాత్రమే దొంగతనం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో టౌన్‌షిప్ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎడారి నేలలో యాపిల్స్, దానిమ్మను పండించిన మహిళా రైతు

ప్రియుడితో కలిసి భర్త మర్డర్.. ఇక తెల్లార్లు అదే పని

మేడారం జాతర ఏరియల్ వ్యూ కోసం హెలికాప్టర్ రైడ్స్.. డిస్కౌంట్ కూడా..

ప్రపంచ అతిపెద్ద గనులు మూసివేత ?? కారణం..

Driving License: ఈ ఐదు తప్పులు చేస్తే లైసెన్స్‌ కట్‌ !!