మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను

Updated on: Dec 28, 2025 | 5:31 PM

పోచారం, మేడ్చల్ జిల్లాలో ఓ ఓమ్ని వ్యానులో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లినా, డ్రైవర్ అప్రమత్తత, సిబ్బంది కృషి వల్ల భారీ ప్రమాదం తప్పింది. ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగలేదు. ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసినా, చివరికి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మేడ్చల్‌ జిల్లా పోచారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పెను ప్రమాదం తప్పింది. పెట్రోలు బంకు సమీపంలో ఓ వ్యానులో మంటలు చెలరేగాయి. డ్రైవర్‌ అప్రమత్తం కావడంతో ప్రాణనష్టం తప్పింది. మంటలు చెలరేగిన ఓమ్ని వ్యాను పెట్రోలు బంకులోకి దూసుకెళ్లడంతో స్థానికులు, బంకులోని సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఘట్‌కేసర్‌ వైపు నుంచి ఉప్పల్‌ వస్తున్న ఓమ్ని వ్యానులో గ్యాస్‌ సిలిండర్‌ పేలి మంటలు చెలరేగాయి. అన్నోజిగూడ లోని పెట్రోలు బంకు సమీపంలోకి రాగానే ఒక్కసారిగా ఓమ్ని వ్యానులో మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్‌ వెంటనే ప్రయాణికులను అలర్ట్‌ చేశాడు. దాంతో వారు వ్యాను దిగి పరుగులు తీశారు. ఈ క్రమంలో వాహనం అదుపుతప్పి పెట్రోల్‌ బంకులోకి దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన బంకు సిబ్బంది అగ్నిమాపక పరికరాలతో మంటల్ని అదుపు చేశారు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంలో ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై పోచారం ఐటీ కారిడార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సోషల్ మీడియాపై ఆర్మీ కొత్త రూల్స్.. ఇన్‌స్టా చూడొచ్చు.. కానీ

క్రిస్మస్‌ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత

Gmail: గుడ్‌ న్యూస్‌.. మీ మెయిల్‌ ఐడీని మార్చుకోవచ్చు.. ఈ విధంగా

తొలి విడత జనగణనకు సర్వం సిద్ధం.. ముందుగా లెక్కించేది వాటినే

Srisailam: శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్