పెళ్లి విందులో అన్నం తిన్నాడని.. ఆ విద్యార్థితో గిన్నెలు కడిగించారు !!

|

Dec 08, 2022 | 9:46 AM

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో దారుణ ఘటన జరిగింది. ‘త్రీ ఇడియట్స్’ సినిమాని పోలిన ఘటన ఇక్కడ వెలుగుచూసింది. పెళ్లి విందులో భోజనం చేసాడని ఓ విద్యార్ధితో గిన్నెలు కడిగించారు.

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో దారుణ ఘటన జరిగింది. ‘త్రీ ఇడియట్స్’ సినిమాని పోలిన ఘటన ఇక్కడ వెలుగుచూసింది. పెళ్లి విందులో భోజనం చేసాడని ఓ విద్యార్ధితో గిన్నెలు కడిగించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. విద్యార్ధి పట్ల ఆ వ్యక్తి తీరుకు నెటిజన్లు మండిపడుతున్నారు. ఆకలితో ఉన్న వ్యక్తి భోజనం చేస్తే ఇలా అవమానించడం సరికాదంటున్నారు. పెళ్లిలో వందలమందికి విందు ఇస్తారు.. ఒక్క వ్యక్తి ఆకలి బాధతో భోజనం చేస్తే అదేదో పెద్ద నేరం అన్నట్లు శిక్షించడం దారుణమంటూ కామెంట్లు చేశారు. జబల్పూరు నగరానికి చెందిన ఓ విద్యార్థి భోపాల్ నగరంలో ఉంటూ ఎంబీఏ చదువుతున్నాడు. ఆ విద్యార్థి పిలవని పెళ్లి విందుకు వచ్చి ఉచితంగా భోజనం చేశాడు. దీంతో అతన్ని పట్టుకున్న వధూవరుల బంధువులు శిక్షగా అతనితో బలవంతంగా గిన్నెలు కడిగించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఓ వృద్ధుడి కోసం స్థానికులు ఏం చేశారో చూస్తే నోరెళ్లబెడతారు !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

రైలు ఎక్కేందుకు మహిళ అగచాట్లు.. లోకో పైలట్ ఏం చేశాడో తెలుసా !!

ట్రెడ్‌మిల్‌పై స్టన్నింగ్‌ స్టెప్స్‌.. హాయ్ రామా అంటూ..

ఐదు పైసలకే ఫుల్ స్టార్ మీల్స్.. హిట్ కొట్టిన బిజినెస్ మ్యాన్.. ఎక్కడో తెలుసా ??

గ్రాండ్ గా పెంపుడు కుక్క బర్త్‌డే సెలబ్రేషన్స్‌ !! 350 మందికి పార్టీ.. గిఫ్ట్ గా గోల్డ్ లాకెట్స్‌

Published on: Dec 08, 2022 09:46 AM