ట్రెక్కర్ల ఆహారంలో బేకింగ్‌ సోడా కలిపి.. ఎవరెస్ట్‌పై రూ.186 కోట్ల స్కామ్‌!

Updated on: Apr 05, 2026 | 2:01 PM

ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరం మౌంట్‌ ఎవరెస్ట్‌ కు సంబంధించిన భారీ కుంభకోణం బయటపడింది. పర్వాతారోహకులు ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు తీసుకొనే ఆహారాన్ని రహస్యంగా ఫుడ్ పాయిజన్‌ చేసారని తేలింది. కొంతమంది ఒక నెట్‌వర్క్‌లా ఏర్పడి ఈ కుట్ర చేసారని, అత్యవసర పరిస్థితిని సృష్టించి భారీగా సొమ్ము చేసుకున్నారని నేపాల్ పోలీసులు అభియోగాలు మోపారు.

ఎవరెస్ట్ పర్వతారోహకులు తీసుకునే ఆహారంలో షెర్పాలు బేకింగ్ సోడా మోతాదును పెంచడతంతో వారు జీర్ణకోశ సమస్యల బారిన పడ్డారు. ఎత్తు కారణంగా అలాంటి సమస్యలు తలెత్తుతుంటాయని ట్రెక్కర్లను వారు నమ్మించారు. అప్పుడే వారి భయాన్ని సొమ్ము చేసుకోవడం మొదలవుతుంది. వారిని అత్యవసరంగా ఆస్పత్రులకు తరలించేందుకు హెలికాప్టర్లను రప్పించారు. ఎంత డబ్బయినా చెల్లించేలా అప్పటికే బాధితులను ఒప్పిస్తారు.పక్కాగా జరుగుతున్న ఈ కుట్రలో కొందరు షెర్పాలు, ట్రెక్కింగ్ ఏజెన్సీలు కలిసి పనిచేసాయి. ఫోర్జరీ చేసిన వైద్య, హెలికాప్టర్‌ ప్రయాణ పత్రాలను సృష్టించి అంతర్జాతీయ ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలను మోసగించారు. అలా వచ్చిన సొమ్మును షెర్పాలు, ట్రెకింగ్‌ ఏజెన్సీలు, హాస్పిటల్స్‌ పంచుకున్నాయి. జనవరిలో ఈ కుంభకోణంపై దర్యాప్తు మొదలైంది.ఈ మోసం విలువ 20 మిలియన్‌ డాలర్లు అంటే సుమారు రూ.186 కోట్లు అని అంచనా వేశారు.

మరిన్ని వీడియోల కోసం :

నో మోర్‌ డౌట్స్‌..కన్ఫార్మ్ చేసిన చెర్రీ

రామాయణ టీజర్‌ అంచనాలను అందుకుందా?

హద్దులు చెరిపేస్తున్న యంగ్ హీరోలు

గాజాలో కంటతడి పెట్టిస్తున్న చిన్నారుల ఆట దృశ్యం

Follow Us