Floods: ఒక్కసారిగా దూసుకొచ్చిన వరదలు.. పలువురు మృతి కొట్టుకుపోయిన వందలాది కార్లు.!

|

Nov 04, 2024 | 11:40 AM

దక్షిణ స్పెయిన్‌లోనూ భారీ వర్షాలు కురిశాయి. దీంతో అక్కడి వీధులు బురద నీటితో నిండిపోయాయి. వరదల కారణంగా తప్పిపోయిన వారి కోసం డ్రోన్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈనేపథ్యంలో స్పెయిన్‌ కేంద్రం ఓ సంక్షోభ కమిటీని ఏర్పాటు చేసింది. వరదల్లో గల్లంతయిన వ్యక్తులు, తుపాను కారణంగా సంభవించిన నష్టం గురించి కమిటీ చర్చించింది.

ఆకస్మిక వరదలతో స్పెయిన్‌ చిగురుటాకులా వణికిపోయింది. భీకర వరదలు బీభత్సం సృష్టించాయి. వరదల వల్ల పలువురు మృతి చెందగా అనేకమంది గల్లంతయ్యారు. గల్లంతయినవారిలో కొంతమంది మృతదేహాలు లభించిక అనేక మంది ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదని స్థానిక అధికారులు ప్రకటించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు వరదల్లో వందలాది కార్లు కొట్టుకుపోతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.అధికారుల సలహాలను ప్రజలు అనుసరించాలని, అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని స్పెయిన్‌ ప్రధాని పెడ్రో శాంచెజ్‌ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

వాలెన్సియా ప్రాంతంలో వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. దీంతో అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. క్రీడా ప్రాంగణాలను మూసివేశారు. పలు విమానాల సర్వీసులను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. రైళ్ల రాకపోకలను సైతం నిలిపివేశారు. మరోవైపు అండలూసియాలో హైస్పీడ్‌ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానిక అధికారులు ప్రకటించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.