ఇలాంటి తాతయ్యలు నూటికో కోటికో ఒక్కరే

Updated on: Nov 28, 2025 | 1:55 PM

తెలంగాణలోని మంథనికి చెందిన 81 ఏళ్ల వసంతశర్మ, రిటైర్డ్ తెలుగు టీచర్‌గా 20 ఏళ్లకు పైగా గొప్ప సేవ చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు, వారి బంధువులకు ఉచితంగా పాలు, బిస్కెట్లు పంపిణీ చేస్తున్నారు. తన పెన్షన్‌లో సగం దీనికే వెచ్చిస్తూ, ఆయన 'మంథని మదర్ థెరిసా'గా గుర్తింపు పొందారు. వయసుతో సంబంధం లేకుండా సేవ చేయాలనే ఆయన సంకల్పం నేటి తరానికి ఆదర్శం.

పల్లె వాతావరణంలో పెరిగిన మనిషి హృదయం ఎంత విశాలంగా ఉంటుందో తెలంగాణ, పెద్ద పల్లి జిల్లా మంథనికి చెందిన 81 ఏళ్ల వసంతశర్మ చూస్తే తెలుస్తుంది. తెలుగు టీచర్‌గా ఎన్నో తరాలకు పాఠాలు చెప్పిన ఆయన, రిటైర్ అయిన తర్వాత కూడా సేవనే ఎంచుకున్నారు. 2002లో రిటైర్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు అంటే ఇరవై ఏళ్లకు పైగా ప్రతి రోజూ ఉదయం తన ఇంటికి సమీపంలో ఉన్న మంథని ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు, వారి బంధువులకు ఉచితంగా పాలు, బిస్కెట్లు అందిస్తున్నారు. 81 ఏళ్ల వయసులో శరీరం సహకరించకపోయినా సేవ చేయాలన్న ఆయన మనసు మాత్రం యవ్వనంతో సమానం. తెల్లవారుజామునే లేచి తాజా పాలు తెప్పిస్తారు. బిస్కెట్‌ ప్యాకెట్లు సిద్ధం చేస్తారు. ఆసుపత్రి సమీపంలోకి రావడంతోనే రోగులు, అటెండెంట్ల ముఖాల్లో చిరునవ్వులు కన్పిస్తాయి. సారూ వచ్చారు.. ఇవాళ కూడా పాలు అందిస్తారు.. అని అక్కడి సిబ్బంది నుంచి రోగులదాకా అందరూ ఆనందిస్తారు. తన చిన్ననాటి నుంచి సహాయం చేయడంలోని ఆనందం శర్మకు అనుభవంలోకి వచ్చింది. ఇప్పటికీ నెలకు దాదాపు రూ.20 వేల వరకు ఈ సేవకే వెచ్చిస్తున్నారు. ఆసుపత్రిలో ఉన్నవాళ్లెవరూ తమ ఇళ్లలో సౌకర్యాల నుంచి వచ్చిన వారు కాదు. బాధలో ఉన్న వారికి తాగడానికి ఒక్క గ్లాసుడు పాలు అందించగలిగితే.. నాకు అంతకన్నా ఆనందం ఏముంటుంది? అని అంటారు. గ్రామం గర్వించే వ్యక్తి వసంతశర్మ. ఆయన సేవలను చూసి గ్రామ ప్రజలే కాదు. ఆసుపత్రి సిబ్బంది కూడా ఆయనను ‘మంథని మదర్ థెరిసా’ అని పిలుచుకునేంతగా గౌరవిస్తున్నారు. వసంతశర్మ జీవితం చెబుతున్న సందేశం ఒక్కటే. సేవ మనసులో ఉంటే వయస్సు, ఆరోగ్యం, ఆర్ధిక పరిస్థితి ఏదీ అడ్డురాదు. పింఛన్‌లో సగం దానం చేస్తూ, శారీరకంగా నిత్యం సేవ చేస్తూ ఆయన చూపుతున్న మానవత్వం నిజంగా నేటి తరానికి ఒక గొప్ప పాఠం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కరెంట్‌ ఆఫీసులో వింత జంతువు..అటవీ సిబ్బంది చూసి..

శబరిమల యాత్రికులకు గుడ్‌ న్యూస్‌..! భోజనంలో మార్పు

వృద్ధులకు గుడ్‌న్యూస్‌..! భారీగా పెరిగిన ఆయుష్మాన్ భారత్ హెల్త్‌ కవరేజ్‌

బంగారం కొంటున్నారా.. బీకేర్‌ఫుల్‌ తక్కువ క్వాలిటీ బంగారంపై ప్యూరిటీ ముద్ర

తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలపై టిటిడి క్లారిటీ.. ఈసారి స్థానికులకు ఇంపార్టెన్స్