థియేటర్‌లో చిమ్మచీకట్లో.. ఇదేం పని బాస్.. ఇక్కడ కూడా ఆపర
కరోనా సమయంలో చాలా సంస్థలు తమ ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం వెసులుబాటును కల్పించాయి. దీంతో చాలామంది హాయిగా ఇంట్లో ఉంటూనే ఉద్యోగం చేసుకున్నారు. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు గమనిస్తే.. మేనేజర్ దగ్గరనుంచి ఎప్పడు కాల్ వస్తుందో, ఏ పని చేయమంటాడో తెలియదు, గడువు ముగిసేలోగా టార్గెట్లను పూర్తిచేయాలి.. ఇలా అనేక అంశాలు ఉద్యోగులను వెంటాడుతున్నాయి. దీంతో ఎక్కడికి వెళ్లినా పనివైపే వారికి ధ్యాసపోతోంది.
కరోనా సమయంలో చాలా సంస్థలు తమ ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం వెసులుబాటును కల్పించాయి. దీంతో చాలామంది హాయిగా ఇంట్లో ఉంటూనే ఉద్యోగం చేసుకున్నారు. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు గమనిస్తే.. మేనేజర్ దగ్గరనుంచి ఎప్పడు కాల్ వస్తుందో, ఏ పని చేయమంటాడో తెలియదు, గడువు ముగిసేలోగా టార్గెట్లను పూర్తిచేయాలి.. ఇలా అనేక అంశాలు ఉద్యోగులను వెంటాడుతున్నాయి. దీంతో ఎక్కడికి వెళ్లినా పనివైపే వారికి ధ్యాసపోతోంది. దీంతో చేసేదేమీ లేక ఏ నిమిషం పనిచేయాల్సి వస్తుందో తెలియక ఎక్కడికి వెళ్లినా చేతిలో ల్యాప్‌ట్యాప్ పట్టుకొని వెళుతున్నారు. ఇటీవల బెంగుళూరులో జరిగిన ఓ ఘటన అలాంటి పరిస్థితికే అద్దంపడుతోంది. బెంగుళూరులో ఓ థియేటర్‌లో జవాన్ తొలి రోజు సినిమా ప్రారంభమైంది. ప్రేక్షకుల కేరింతలతో సినిమా థియేటర్ దద్దరిల్లుతోంది. ఓ ఉద్యోగి సమయం వృథా చేయటం ఎందుకు అనుకున్నాడో ఏమోగానీ.. తన వద్ద ఉన్న ల్యాప్‌ట్యాప్ తీసి ఆఫీసు పనిలో నిమగ్నమయ్యాడు. ఈ దృశ్యాలను సినిమా హాలులోని ఓ వ్యక్తి వీడియోలో బంధించి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హోటల్లో టేబుల్ శుభ్రం చేస్తున్న వెయిటర్.. అంతలోనే..
70 మందితో వెళ్తున్న విమానం.. ఉన్నట్టుండి పొలాల్లో ల్యాండింగ్..