మానవత్వమా నీవెక్కడ?భార్య మృతదేహాన్ని బైక్‌కు కట్టి వీడియో
రక్షాబంధన్ రోజున భార్యాభర్తలు కబుర్లు చెప్పుకుంటూ బైక్‌పై వెళుతున్నారు. అంతలో ఓ ట్రక్ వారి బైక్‌ను బలంగా ఢీకొంది. ఘటనా స్థలంలోనే భార్య కన్నుమూసింది. ఆమె మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకువెళ్లేందుకు సాయం చేయాలంటూ జాతీయ రహదారి పై వెళుతున్నవారిని ఆమె భర్త వేడుకున్నాడు. మృతదేహాన్ని తరలించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో నిస్సహాయ స్థితిలో ఆ భర్త ఏం చేశాడో తెలుసా?
మహారాష్ట్రలోని నాగ్‌పూర్-జబల్‌పూర్ జాతీయ రహదారిపైన మోర్‌ఫాటా వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో గ్యార్సి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆమె భర్త అమిత్ యాదవ్ సహాయం కోసం అటు వైపుగా వెళుతున్న వారిని ప్రాధేయపడ్డాడు. సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో అమిత్ తన భార్య మృతదేహాన్ని తన బైక్ వెనక సీటుపై తాళ్లతో కట్టి, మధ్యప్రదేశ్‌లోని తమ స్వగ్రామానికి బయలుదేరాడు. అమిత్ జాతీయ రహదారిలో బైక్‌పై భార్య మృతదేహాన్ని తీసుకెళుతున్న దృశ్యాన్ని అటుగా వెళుతున్న ఒకరు కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. వీడియో చూసినవారు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.భార్య మృతదేహాన్ని మోటర్‌సైకిల్‌పై తీసుకెళ్తున్న దృశ్యాన్ని చూసిన చాలా మంది అతని బైక్‌ను ఆపేందుకు ప్రయత్నించారు. అయితే అమిత్ అందుకు నిరాకరిస్తూ, బైక్‌ను ముందుకు పోనిచ్చాడు. హైవే పోలీసులు అమిత్ వాహనాన్ని గమనించి, ఆపమని కోరారు. అయినా అమిత్ వారి మాటను లేక్కచేయలేదు. కొంతదూరం వరకూ పోలీసులు అతని బైక్‌ను వెంబడిస్తూ చివరకు బైక్‌ను ఆపారు. పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం నాగ్‌పూర్‌లోని మాయో ఆసుపత్రికి తరలించారు. అలాగే అమిత్‌కు తగిన సాయం అందిస్తామని హామీనిచ్చారు. ఈ ఘటన ప్రస్తుత కాలంలో అడుగంటుతున్న మానవత్వాన్ని ప్రశ్నించేదిగా ఉందని పలువురు అంటున్నారు
మరిన్ని వీడియోల కోసం :