Viral Video: నడి రోడ్డుపై వరద నీటిలో యువకుడు చిల్‌.. వీడియో చూశారంటే నవ్వకుండ ఉండలేరు..

|

Jul 11, 2022 | 9:31 AM

రుతుపవనాల ఎఫెక్ట్‌తో దేశవ్యాప్తంగా జోరుగా వర్షాలు పడుతున్నాయి. అటు దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.

నడి రోడ్డుపై వరద నీటిలో యువకుడు చిల్‌ @TV9 Telugu Digital

రుతుపవనాల ఎఫెక్ట్‌తో దేశవ్యాప్తంగా జోరుగా వర్షాలు పడుతున్నాయి. అటు దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్డుపై ప్రవహిస్తున్న వరద ఉధృతిలో ఓ వ్యక్తి రోడ్డుపై హాయిగా పడుకుని ఉన్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అతను మలాడ్‌లో మాల్దీవులను అనుభవిస్తున్నాడని నెటిజన్లు సరదాగా కామెంట్‌ చేస్తున్నారు. రద్దీ తక్కువగా ఉన్న రోడ్డుపై బస్సులు, కార్లు వంటి వాహనాలు వెళుతున్నాయి. రోడ్డంతా వరద నీరు నిండిపోయి ఉంది. కానీ, వరదలో రహదారిపై ఆ వ్యక్తి ప్రశాంతంగా పడుకుని ఉన్నాడు. వచ్చే పోయే వాహనాలతో అతనిపై నీరు ఎగజల్లినట్టుగా పడుతోంది. అయినా అతడు హాయిగా కాలుమీద కాలు వేసుకుని పడుకుని ఉన్నాడు. వీడియో షేర్ చేసిన వెంటనే వైరల్‌గా మారింది. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral Video: గడ్డి మేస్తున్న గుర్రాన్ని కెలికితే అలాగే ఉంటుంది మరి.. ఏమి చేసిందో మీరు ఓ లుక్ వేయండి

Published on: Jul 11, 2022 09:31 AM