Viral: ఇతను అసాధ్యుడు.. భార్య పెళ్లి ఉంగరాల కోసం 18 టన్నుల చెత్తను జల్లెడ పట్టాడు..!
కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో స్టీవ్ వ్యాన్ అనే వ్యక్తి తన భార్య జెన్నిఫర్ పోగొట్టుకున్న పెళ్ళి ఉంగరాల కోసం 18 టన్నుల చెత్తను జల్లెడ పట్టాడు. పాప్‌కార్న్ సంచిలో పడిపోయిన ఉంగరాలు డంపింగ్ యార్డ్‌కు చేరాయి. స్టీవ్ తన పట్టుదలతో, డంపింగ్ యార్డ్ సిబ్బంది సహాయంతో, రెండు ఉంగరాలను కనుగొన్నాడు.
కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో తన సతీమణి పోగొట్టుకున్న పెళ్లి ఉంగరాల కోసం ఓ వ్యక్తి తీవ్ర ప్రయత్నం చేశాడు. ఇందుకోసం దాదాపు 18 టన్నుల చెత్తను జల్లడ పట్టాడు. అసలు ఏం జరిగిందంటే స్టీవ్ వ్యాన్ భార్య జెన్నిఫర్ చేతిలో ఉన్న పాప్ కార్న్ కిందపడి చెల్లా చెదురైపోయింది. వాటిని సేకరించి చెత్త సంచిలో వేసేటప్పుడు ఆమె చేతికి ఉన్న ఉంగరాలు కూడా అందులో పడిపోయాయి. ఆ సమయంలో ఆ విషయాన్ని ఆమె గుర్తించలేదు. తర్వాత పారిశుధ్య కార్మికులు ఆ బ్యాగును తీసుకు వెళ్ళిపోయారు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా అవి ఏ సమయంలో కనిపించకుండా పోయాయో కన్ఫామ్ చేసుకున్నారు. చేతి ఉంగరాలు రెండు పాప్ కార్న్ సంచిలోనే పడిపోయినట్లు అంచనాకు వచ్చారు. అయితే అప్పటికే ఆ చెత్తను డంపింగ్ యార్డుకు తీసుకు వెళ్ళిపోయారు. అవి దొరక్కపోవచ్చని జెన్నిఫర్ సందేహం వ్యక్తం చేసినప్పటికీ భర్త మాత్రం వదిలిపెట్టలేదు.
మరుసటి రోజు స్థానిక డంపింగ్ యార్డుకు వెళ్ళిన స్టీవ్ వ్యాన్ జరిగిన విషయాన్ని వివరించాడు. దీంతో ఆ ఉంగరాలను వెతుక్కోవడానికి వారు అంగీకరించారు. గ్లోవ్స్ ధరించి పార చేతబట్టి ఉంగరాల కోసం వెతకడం మొదలుపెట్టాడు. అతని ప్రయత్నాలు ఫలించకపోవచ్చని అక్కడున్న వారు డౌట్ పడినప్పటికీ అతను వెనక్కి తగ్గలేదు. డంపింగ్ యార్డ్ కాంట్రాక్టర్ ఏం చెప్పారంటే అలా వెతకాడానికి బదులుగా ఒక కొత్త ఉంగరం కొనివ్వడం ఉత్తమం అని స్టీవ్ వ్యాన్ కు చెప్పాలని అనుకున్నాడట. అయితే స్టీవ్ పట్టుదలను చూసి తన జేసీబీతో వ్యర్థాలను తలగించి సాయం చేశానని అన్నాడు. చివరకు కొన్ని కవర్లను గుర్తించిన స్టీవ్ వ్యాన్ కు అందులో ముందు ఓ ఉంగరం తర్వాత మరో ఉంగరం లభించాయి. దీంతో అతడు ఫుల్ గా కుషీ అయ్యాడు. మొత్తానికి భార్య అంటే ప్రేమ ఉన్నవారు ఉంగరాలు వెతకకుండా ఎలా ఉండగలరు అన్న కామెంట్ వస్తుంది.
