ఈ దారుణ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలో ఎన్నో ఏళ్ల నుంచి సాయిబాబా గుడి దగ్గర భార్యతో కలిసి అశోక్ అనే యాచకుడు బిచ్చం ఎత్తుకుంటున్నాడు. అలా యాచించిన డబ్బును తన కుమార్తె భవిష్యత్తుకోసం అని దాచి పెట్టుకున్నారు ఆ దంపతులు. అయితే మూడు సంవత్సరాల క్రితం వారు దాచుకున్న 50వేల రూపాయాలను అప్పుగా తీసుకున్నాడు హోటల్ వ్యాపారి నర్సింహారావు. అప్పటి నుంచి వడ్డీ ఇవ్వకపోగా.. మొత్తానికే ఎగనామం పెట్టాడు. అప్పు తిరిగి ఇవ్వకుండా మొఖం చాటేశాడు . ఇటీవల యాచకుడు అశోక్‌తో పాటు మొత్తం 69 మందికి ఐపీ నోటీసులు పంపాడు. ఖమ్మంలోని సివిల్ కోర్టులో దివాళా పిటిషన్ దాఖలు చేశాడు. మొత్తం ఒక కోటీ 95లక్షల అప్పు తీసుకొని.. 69మందికి ఐపీ నోటీసులు ఇచ్చాడు. నోటీసులు పొందిన వారిలో యాచకుడు గొళ్లల అశోక్ కూడా ఉండడంతో స్థానికులంతా విస్తుపోతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్రాఫిక్ పోలీస్‌ను కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్ !!
వీళ్లు దీపావళి రాకెట్‌ను ఎలా పేల్చారో చూస్తే షాకవుతారు !!
LPG Gas Cylinder: ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్లను ఎలా పొందాలంటే ??