కుక్క వెంటపడి.. థర్డ్ ఫ్లోర్‌ నుంచి కింద పడ్డ యువకుడు

Updated on: Oct 27, 2024 | 9:54 PM

హైదరాబాద్‌లోని చందానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. కుక్కతో పరాచకాలు ఆడిన ఓ వ్యక్తి మూడో అంతస్తుపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వీవీ ప్రైడ్ హోటల్లో ఈ ఘటన జరిగింది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకోగా సోమవారం రాత్రి వరకు వార్త బయటకు పొక్కలేదు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ సభ్యులతో నగరానికి వచ్చిన తెనాలికి చెందిన ఉదయ్ రామచంద్రాపురం అశోక్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. అయితే.. ఆదివారం బర్త్‌డే పార్టీ లో పాల్గొనేందుకు చందానగర్‌లోని వీవీ ప్రైడ్ హోటల్లో స్నేహితులతో కలిసి రూమ్‌లో దిగాడు. స్నేహితులతో కలిసి హోటల్లోని మూడో అంతస్తు బాల్కనీలోకి వెళ్లగానే అక్కడే కనిపించిన ఓ కుక్కతో పరాచకాలు ఆడాడు. కుక్కను పరుగులు పెట్టిస్తూ దానిని ఆడించాడు. పరిగెడుతూ చివరకు అక్కడున్న కిటికీ వైపు వెళ్లాడు.. ఈ క్రమంలోనే కిటికీలోంచి కింద పడి ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర గాయాల పాలైన ఉదయ్‌ను చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఉదయ్‌ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. సీసీటీవీ కెమెరాలలో ప్రమాదం దృశ్యాలు రికార్డు అయ్యాయి. అసలు హోటల్ మూడో అంతస్తులోకి కుక్క ఎలా వచ్చింది? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. కేసు నమోదు చేసుకుని చందానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆటో డ్రైవర్ తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఆ భాష రాని వాళ్లకు ఆయనే టీచర్

‘ఠాగూర్’ మూవీపై ప్రముఖ డాక్టర్ షాకింగ్ కామెంట్స్

Sundeep Kishan: అన్నార్తుల ఆకలి తీరుస్తున్న టాలీవుడ్‌ హీరో..

‘అది నా జీవితాన్నే మార్చేసింది’.. భర్తకు థ్యాంక్స్‌ చెప్పిన నయన్‌

కుళ్లిపోయిన తల్లి మృతదేహాన్ని 3 నెలలపాటు ఇంట్లోనే !!

Loading...
Unable to load recommendations.
Follow Us