పామును కాపాడేందుకు తన ప్రాణం పణంగా పెట్టాడు !!

|

Jul 11, 2023 | 9:53 AM

భూమిపై జీవరాశులు మనుగడ సాగించాలంటే నీరు, గాలి అత్యంత ప్రధానమైనవి. ఈ రెండిటిలో ఏది కొరవడినా జీవించడం కష్టం. ఇక ఎండాకాలం వచ్చిందంటే నీటి కోసం ప్రతి జీవి అల్లాడుతుంది. మనుషులు, పశుపక్ష్యాదులు కూడా నీటి చుక్కకోసం అలమటిస్తారు. వన్యప్రాణులు నీరు, ఆహారం కోసం జనావాసాల్లోకి వస్తుంటాయి.

భూమిపై జీవరాశులు మనుగడ సాగించాలంటే నీరు, గాలి అత్యంత ప్రధానమైనవి. ఈ రెండిటిలో ఏది కొరవడినా జీవించడం కష్టం. ఇక ఎండాకాలం వచ్చిందంటే నీటి కోసం ప్రతి జీవి అల్లాడుతుంది. మనుషులు, పశుపక్ష్యాదులు కూడా నీటి చుక్కకోసం అలమటిస్తారు. వన్యప్రాణులు నీరు, ఆహారం కోసం జనావాసాల్లోకి వస్తుంటాయి. అలా నీరు లేక డీ హైడ్రేషన్‌కు గురై చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ పామును ప్రాణాలకు తెగించి కాపాడాడు ఓ వ్యక్తి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. త‌మిళ‌నాడులోని క‌డ‌లూరు జిల్లా తిరుచ‌ప‌రూర్‌లో నటరాజన్‌ అనే సామాజిక కార్యకర్త తన ఇంటి ఆవరణలో ఓ నాగుపాము అచేతనంగా పడిఉంది. దానిని గమనించిన ఆయన పర్యావరణ వేత్త అయిన చెల్లాకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న చెల్లా కదలలేకుండా ఉన్న పామును పరిశీలించి అది డీ హైడ్రేషన్‌కు గురైనట్టు గుర్తించారు. వెంటనే తనవద్ద ఉన్న బాటిల్‌నుంచి ఆ నాగుపాముకు నీళ్లు తాగించాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రపంచంలోనే అతిపెద్ద రెస్టారెంట్ !! 24 గంటలూ వడ్డన !!

ట్విట్టర్‌కు పోటీగా కొత్త “థ్రెడ్స్‌’ యాప్‌ !! ఎలన్‌ మస్క్‌ను డీ కొట్టనున్న జుకర్‌బర్గ్‌

Project K: ప్రభాస్ ప్రాజెక్ట్‌ కె టైటిల్‌ ఇదేనా ??

భర్త పుట్టిన రోజున మర్చిపోలేని గిఫ్ట్‌ ఇచ్చిన మహాలక్ష్మి !!

Ileana D’Cruz: తొమ్మిదోనెల.. చాలా కష్టంగా ఉంది.. ఇలియానా తాజా పోస్ట్

 

Follow us on