నీ కష్టం పగోడికి కూడా రావద్దు బ్రో .. వైరల్ అవుతున్న వీడియో

Updated on: Aug 02, 2025 | 8:24 AM

అడుగడుగునా సీసీ కెమేరాలున్న ఈ రోజుల్లో దొంగతనం అంటే చిన్నవిషయమేం కాదు. దానికి ఎంతో ట్యాలెంట్‌ కావాలి.. అంతకు మించిన ప్లాన్‌ ఉండాలి. లేకపోతే వెళ్లిన చోట అడ్డంగా బుక్‌ కావటం ఖాయం. అయితే.. ఇలాంటివేం పట్టించుకోకుండా పండ్ల ట్రే దొంగతనం చేసి నానాతిప్పలు పడ్డాడు ఓ దొంగ. సోషల్‌ మీడియాలో ఇప్పుడు ఆ సంఘటన తాలూకూ వీడియో వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో అతను పడిన తిప్పలు చూస్తే ఎవరికైనా నవ్వు రాక మానదు.

సీసీ కెమెరాలో రికార్డైన ఈ దృశ్యాలను ఒక వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌లో పోస్ట్‌ చేశాడు. ఒక షాప్‌ ముందు కొన్ని పండ్ల ట్రేలు ఉండగా, వాటిని కాజేయాలనే ఉద్దేశంతో ఒక వ్యక్తి స్కూటీ మీద అక్కడికి వస్తాడు.నెమ్మదిగా అటూ ఇటూ చూసి.. తన స్కూటీ మీద వచ్చి ఫ్రూట్స్ ట్రే పెట్టుకుని స్కూటీని స్టార్ట్‌ చేసి టర్న్‌ చేస్తున్నాడు. అంతలోనే పండ్ల ట్రే కిందపడిపోవటంతో.. అందులోని పండ్లన్నీ కింద పడిపోయాయి. అతి కష్టంమీద స్కూటీని బ్యాలెన్స్ చేసి.. ట్రేని అందుకున్నాడు. ఇంతలో అతని హెల్మెట్‌ ఊడిపోయింది.అయితే హెల్మెట్‌ను తీసుకోవడానికి ప్రయత్నించగా మళ్లి బ్యాలన్స్‌ ఔట్‌ అయి అతని స్కూటీ పడిపోయింది. ఆఖరికి.. ఎలాగోలా స్కూటీని పైకి లేపి స్టార్ట్ చేసుకొని ముందుకు వెళ్లాడు. కానీ అక్కడ రోడ్డుపై నీరు ఉండడంతో స్కూటీ స్కిడ్‌ అయి పడిపోయింది. ఇలా దొంగతనం మొదలు పెట్టినప్పటి నుంచి వెళ్లిపోయే దాకా అతనికి అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. ఇన్‌స్టాలో ఈ వీడియో చూసిన నెటిజన్‌లు తమదైన రీతిలో కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

మీ గుట్టురట్టు చేసే wifi వచ్చిందోచ్‌ వీడియో

డెలివరీ బోయ్స్‌గా షాపులోకి ఎంట్రీ.. కట్‌చేస్తే

అదృష్టమంటే ఇదే.. ఒకేసారి 8 వజ్రాలు దొరికాయ్‌ వీడియో

అయ్యో.. చిట్టి చింపాంజీ చేసిన పనికి తల పట్టుకున్న తల్లి వీడియో

Published on: Aug 01, 2025 06:59 PM