అదృష్టం అంటే ఇతనిదే.. బురదలో దొరికిన మట్టికుండలో

Updated on: Jun 18, 2025 | 6:14 PM

మధ్యతరగతి వారికి నిత్యం ఆర్ధిక కష్టాలే. ఒక సమస్య తీరేసరికి ఇంకో సమస్య ఎదురవుతుంటుంది. అలాంటి సమయంలో వారికి లాటరీ తగలడమో.. లేదంటే నిధి లాంటిది ఏమైనా దొరికింది అంటే వారి ఆనందానికి అవధులుండవు. అలాంటి వారిని అందరూ అదృష్టవంతులు అంటూ ఉంటారు. అలా ఓ వ్యక్తికి ఇంటి ఆవరణలో తవ్వుతుండగా అతనికి బంగారు నిధి దొరికింది.

దాంతో అతను ఆనందంతో పొంగిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అతను తన ఇంటి ఆవరణలో తవ్వుతుండగా ఓ మట్టి కుండ కనబడింది. ఏదో పగిలిపోయిన పాతకుండ పెంకు అయి ఉంటుందిలే అనుకున్నాడు. కానీ అలా తవ్వుతుండగా పూర్తిగా కుండ బయటపడింది. అది పగలగొట్టి చూడగానే దాని లోపల బంగారు ఆభరణాలు, నాణేలు కనిపించాయి. దీంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇవి పాత కాలం నాటి నిజమైన నాణేలు అని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను పదిలక్షలమందికి పైగా వీక్షించారు. దాదాపు లక్షమందికి పైగా లైక్‌ చేశారు. అదృష్టం అంటే అతనిదే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే

కారు డ్రైవర్‌ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్.. ఫ్లైఓవర్‌ పై నుంచి దూసుకెళ్లిన కారు.. కట్‌ చేస్తే

తనకు అన్నం పెట్టి ఆదరించిన వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా

మందేసి ఫుట్‌పాత్‌పై నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం

రూ.500 నోటుపై స్టార్‌ గుర్తు.. ఇది నకిలీదా..ఆర్బీఐ ఏం చెబుతోంది?