ఓర్నీ బండబడా.. ప్రాణమంటే అంత చులకనా.. ఈ డేంజర్‌ ప్రయాణం తగదంటున్న నెటిజనం

|

Jul 11, 2022 | 9:36 AM

దేశంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. నిర్లక్ష్యం కారణంగానే వాహన ప్రమాదాలు పెరుగుతున్నాయని అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి.

దేశంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. నిర్లక్ష్యం కారణంగానే వాహన ప్రమాదాలు పెరుగుతున్నాయని అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం కూడా ప్రమాదాలకు అసలు కారణం. వాహనదారులు రాంగ్ రూట్‌లో వెళ్లడం, ఓవర్ టెక్ చేయడం, వేగంగా వెళ్లడం లాంటి వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు నెత్తి బాదుకుంటున్నారు. వీటిపై ఎంత అవగాహన కల్పిస్తున్నా వాహనదారులు మాత్రం నెత్తికెక్కించుకోవడం లేదు. తద్వారా ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా అలాంటి ఫొటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫొటోలో ఓ వ్యక్తి బైక్‌ నడుపుతున్నాడు.. మరో వ్యక్తి వెనుక కూర్చొని ఉన్నాడు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా… అతను వెనుక బైక్‌పై ఉన్న గ్యాస్ బండపై కూర్చొని ప్రయాణిస్తున్నాడు. అంతేకాదు ఫోన్ కూడా మాట్లాడుతున్నాడు. వెనుకవైపు బ్యాగు.. ముందు ఒక బాక్సు కూడా ఉంది. నడిరోడ్డుపై ఈ డేంజర్ ప్రయాణం ఏంటంటూ చాలా మంది ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇలా వెళ్లడం వారికే కాదు.. రోడ్డుపై రాకపోకలు సాగించే వారికి కూడా ప్రమాదమేనంటూ ఫైర్ అవుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆరు పదుల వయసులోనూ అద్భుతమైన గొంతు.. అచ్చం లతా మంగేష్కర్‌లా

మూడు నెలల్లో 33 సార్లు.. ఈమె కటాల్సిన చలాన్‌ డబ్బుతో ఓ లగ్జరీ ఇల్లు కొనొచ్చట

Viral Video: గడ్డి మేస్తున్న గుర్రాన్ని కెలికితే అలాగే ఉంటుంది మరి.. ఏమి చేసిందో మీరు ఓ లుక్ వేయండి

Viral Video: నడి రోడ్డుపై వరద నీటిలో యువకుడు చిల్‌.. వీడియో చూశారంటే నవ్వకుండ ఉండలేరు..

Published on: Jul 11, 2022 09:36 AM