వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో ఓ దొంగ.. లక్షల విలువ చేసే వజ్రాల లాకెట్‌ను మింగేశాడు. నగల దుకాణ యజమాని ఫిర్యాదుతో పోలీసులు దొంగను పట్టుకున్నారు. కానీ ఆ లాకెట్‌ను స్వాధీనం చేసుకోవడానికి మాత్రం తంటాలు పడ్డారు. చివరాఖరికి చాలా కష్టపడి.. మొత్తానికి ఆ లాకెట్‌ను బయటకు తీసారు.
ప్రముఖ ప్యాట్రిడ్జ్ జ్యువెలర్స్ దుకాణంలో ఈ దొంగతనం జరిగింది. 32 ఏళ్ల ఒక వ్యక్తి దుకాణంలోకి ప్రవేశించి, అత్యంత విలువైన లాకెట్‌ను దొంగిలించాడు. అయితే దానిని దాచుకునే క్రమంలో సడెన్ గుడ్డు ఆకారంలో ఉన్న లాకెట్‌ను టక్కున మింగేసాడు. ఈ విషయం గమనించిన దుకాణ యజమాని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మింగిన లాకెట్‌ను బయటకు తీయడం పోలీసులకు సవాలుగా మారింది. అతడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ నిందితుడికి పలు టెస్ట్‌లు చేసారు. లాకెట్ పొట్టలో ఎక్కడా ఇరుక్కుపోకుండా, ఇబ్బంది లేకుండా ఉన్నట్లు గుర్తించారు. వైద్యుల పర్యవేక్షణలో, ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేకుండా సురక్షితంగా బయటకు తీయగలిగారు. ప్రస్తుతం నిందితుడు వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు. ఆ లాకెట్ విలువ మన కరెన్సీలో 18 లక్షల రూపాయలని తెలిసింది. ఈ దొంగతనం కేసు స్థానిక మీడియాలో, అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశమైంది.
మరిన్ని వీడియోల కోసం :
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియో
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్ కిల్లర్‌పేరెంట్స్.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. తొడగొట్టి సవాలు విసురుతున్న 95 ఏళ్ల యువకుడు వీడియో
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
