Kadapa: మాట్లాడుకుందాం రమ్మని పిలిచి.. మంట పెట్టేశాడు.!

|

Oct 24, 2024 | 8:22 PM

రోజురోజుకూ ఆడవారిపై అరాచకాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రేమ అంగీకరించకపోతే ఎంతకైనా తెగిస్తున్నారు ఉన్మాదులు. తాజాగా ప్రేమ పేరుతో మరో మృగాడు రెచ్చిపోయాడు. ప్రేమిస్తావా.. చంపేయమంటావా అంటూ యువతికి అల్టిమేటం జారీ చేశాడు. ఆ విద్యార్థి నుంచి ఎలాంటి రిప్లై రాకపోవడంతో ఏకంగా చున్నికి నిప్పంటించి యువతిపై వేసినట్లు తెలుస్తోంది. ఈ దారుణం కడప జిల్లా బద్వేల్‌లో చోటు చేసుకుంది.

ప్రేమ పేరుతో మరో మృగాడు రెచ్చిపోయాడు. ప్రేమిస్తావా.. చంపేయమంటావా అంటూ యువతికి అల్టిమేటం జారీ చేశాడు. ఆ విద్యార్థి నుంచి ఎలాంటి రిప్లై రాకపోవడంతో ఏకంగా చున్నికి నిప్పంటించి యువతిపై వేసినట్లు తెలుస్తోంది. ఈ దారుణం కడప జిల్లా బద్వేల్‌లో చోటు చేసుకుంది. నన్ను ప్రేమించు, లేదంటే చనిపోతా అని విద్యార్దినిని బెదిరించారు విగ్నేష్ అనే 20 ఏళ్ల యువకుడు. సెంచరీ ప్లై ఉడ్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి పిలిపించాడు. అతను చెప్పిన దానికి యువతి అంగీకరించకపోవడంతో నిప్పంటించినట్లు తెలుస్తోంది.

హైవే 67పై కొనఊపిరితో యువతి కొట్టుమిట్టాడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. హుటాహుటిన స్పాట్‌కు చేరుకున్న పోలీసులు చికిత్స కోసం ఆమెను 108 వాహనంలో బాలికను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బద్వేల్ రామాంజనేయ నగర్‌కు చెందిన యువతి ఓ ప్రైవేట్ కాలేజీలో MPC ఫస్ట్ ఇయర్ చదువుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.