మలావీ ఎయిర్‌క్రాఫ్ట్‌ మిస్సింగ్‌ విషాదాంతం.. ఉపాధ్యక్షుడు సహా 10 మంది దుర్మరణం.

|

Jun 13, 2024 | 5:03 PM

ఓ అధికారిక కార్యక్రమం కోసం చీలిమా నేతృత్వంలోని బృందంగా బయల్దేరగా.. కాసేపటికే రాడార్‌ నుంచి ఆ ఎయిర్‌క్రాఫ్ట్‌ కు సంబంధాలు తెగిపోయాయి. దీంతో.. భారీగా సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. అయితే ఈ ఉదయం విఫ్య పర్వతాల్లోని చికంగావా అడవుల్లో కూలిన ఎయిర్‌క్రాఫ్ట్‌ శకలాలను గుర్తించారు. అందులో ఎవరూ సజీవంగా లేరని ఆ దేశ అధ్యక్ష భవనం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.

మలావీ ఆర్మీ ఎయిర్‌క్రాఫ్ట్‌ మిస్సింగ్‌ ఘటన విషాదాంతంగా ముగిసింది. ఉపాధ్యక్షుడు సావులోస్‌ చీలిమాతో పాటు మరో తొమ్మిది మంది ఈ ప్రమాదంలో మరణించినట్లు ఆ దేశ అధ్యక్ష భవనం మంగళవారం ఉదయం ప్రకటించింది. ఓ అధికారిక కార్యక్రమం కోసం చీలిమా నేతృత్వంలోని బృందంగా బయల్దేరగా.. కాసేపటికే రాడార్‌ నుంచి ఆ ఎయిర్‌క్రాఫ్ట్‌ కు సంబంధాలు తెగిపోయాయి. దీంతో.. భారీగా సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. అయితే ఈ ఉదయం విఫ్య పర్వతాల్లోని చికంగావా అడవుల్లో కూలిన ఎయిర్‌క్రాఫ్ట్‌ శకలాలను గుర్తించారు. అందులో ఎవరూ సజీవంగా లేరని ఆ దేశ అధ్యక్ష భవనం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ దుర్ఘటనపై అధ్యక్షుడు లాజరస్‌ చక్వేరా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. విమానంలో చిలిమా భార్య మేరీ, యునైటెడ్ ట్రాన్స్‌ఫర్మేషన్ మూవ్‌మెంట్ పార్టీకి చెందిన పలువురు అధికారులు ఉన్నారు. మలావీ మాజీ ప్రథమ పౌరురాలు షానిల్‌ జింబిరి కూడా ఉన్నారు. మూడు రోజుల క్రితం మాజీ క్యాబినెట్ మంత్రి రాల్ఫ్ కసంబర చనిపోయారు. ఆయన అంత్యక్రియలకు ప్రభుత్వం తరపున హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. షెడ్యూల్‌ ప్రకారం 45 నిమిషాల అనంతరం ఎంజుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. కానీ, ఆ సమయానికి విమానం అక్కడికి చేరుకోలేదు. దీంతో ఏదో ప్రమాదం జరిగి ఉంటుందని ఊహించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.