Viral: తన అభిమాన హీరోయిన్‌ పుట్టినరోజున ఇతను ఏం చేశాడో తెలుసా.?

|

Jan 24, 2024 | 5:19 PM

అభిమానులు తమ అభిమాన హీరో పుట్టినరోజు వచ్చిందంటే వివిధ రకాల సేవా కార్యక్రమాల ద్వారా తమ అభిమానాన్ని చాటుకుంటారు. తాజాగా ఓ అభిమాని తను ఎంతగానో అభిమానించే ఓ హీరోయిన్ పుట్టినరోజు వేడుకలు భిన్నంగా నిర్వహించాడు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన బవిరి శెట్టి మురళీకృష్ణ సినీ హీరో కృష్ణ కి వీరాభిమాని. అంతేకాక ఆయన కృష్ణ మహేష్ బాబు యువసేన అధ్యక్షులు. హీరో కృష్ణ కుటుంబంలో ఎవరి పుట్టినరోజు వచ్చినా మురళీకృష్ణ జంగారెడ్డిగూడెంలో పెద్ద ఎత్తున పండుగలా నిర్వహిస్తారు.

అభిమానులు తమ అభిమాన హీరో పుట్టినరోజు వచ్చిందంటే వివిధ రకాల సేవా కార్యక్రమాల ద్వారా తమ అభిమానాన్ని చాటుకుంటారు. తాజాగా ఓ అభిమాని తను ఎంతగానో అభిమానించే ఓ హీరోయిన్ పుట్టినరోజు వేడుకలు భిన్నంగా నిర్వహించాడు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన బవిరి శెట్టి మురళీకృష్ణ సినీ హీరో కృష్ణ కి వీరాభిమాని. అంతేకాక ఆయన కృష్ణ మహేష్ బాబు యువసేన అధ్యక్షులు. హీరో కృష్ణ కుటుంబంలో ఎవరి పుట్టినరోజు వచ్చినా మురళీకృష్ణ జంగారెడ్డిగూడెంలో పెద్ద ఎత్తున పండుగలా నిర్వహిస్తారు. ఆయన జంగారెడ్డిగూడెంలో ఫ్రూట్ జ్యూస్ వ్యాపారం చేసే మురళీ జ్యూస్ స్టాల్ నిండా కృష్ణ మహేష్ బాబు ఆయన సతీమణి నమ్రత ఫోటోలే కనిపిస్తాయి. అయితే అయోధ్య బాల రాముని ప్రతిష్ట రోజునే తన హీరో మహేష్ బాబు సతీమణి ప్రముఖ హీరోయిన్ నమ్రత శిరోత్కర్ పుట్టినరోజు వచ్చింది. దాంతో ప్రతి సంవత్సరం లాగానే జంగారెడ్డిగూడెం ప్రాంత ఆసుపత్రిలో రోగులకు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు..

మరోపక్క అయోధ్య బాల రాముని కృప పొందే విధంగా ఆంజనేయుడిగా కొలవబడే వానరాలకు ఆహారం అందించారు. ద్వారకాతిరుమల మండలం జి కొత్తపల్లి అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న సుమారు రెండువేలకు పైగా వానరాలకు ఆహారం అందించి మూగజీవుల పట్ల మానవత్వాన్ని చాటుకున్నారు. తన అభిమాన హీరోయిన్ పుట్టినరోజు రోజున మూగజీవాల కడుపు నింపడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అంతేకాదు, పెళ్లి , పుట్టినరోజు వేడుకలు జరుపుకునే ప్రతి ఒక్కరు ఇక్కడ ఆకలితో అలమటిస్తున్న వానరాల కడుపు నింపితే బాగుంటుందని ఆయన కోరారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos