గత అమావాస్యకు క్షుద్రపూజలు.. ఈ అమావాస్యకు షాపు దగ్ధం

Updated on: Oct 23, 2025 | 4:23 PM

అమావాస్య వేళ క్షుద్రపూజలు కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఓ దుకాణం ముందు జరిపిన క్షుద్రపూజల కారణంగా షాపు మంటల్లో కాలి బూడిదైపోయిన ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళన రేకెత్తించింది. గత నెలలో అమవాస్య రోజు ఓ మొబైల్‌ షాపు ముందు గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించారు. తాజాగా అదే షాపు దీపావళి అమవాస్య రోజు ఊహించని విధంగా మంటలు చెలరేగి దగ్ధమైంది.

ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నెహ్రూసెంటర్ లో నిత్యం కస్టమర్స్ తో రద్దీగా ఉండే మణి మొబైల్స్ లో అగ్నిప్రమాదం జరిగింది. విలువైన మొబైల్స్, మొబైల్ పరికరాలు, రిపేర్ కోసం ఇచ్చిన సెల్ ఫోన్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. కష్టపడి లక్షలు ఖర్చుచేసి ఏర్పాటు చేసుకున్న షాపు కళ్లెదుటే కాలిపోతుంటే నిస్సహాయంగా బోరున విలిపిస్తూ చూస్తుండిపోయాడు యజమాని, కుటుంబ సభ్యులు. కాగా, ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందని అంతా అనుమానిస్తున్నారు.. నెహ్రూ సెంటర్లో నిత్యం రద్దీగా ఉండే ఈ మొబైల్ షాప్ బాగా నడుస్తుందని ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు షాపు యజమాని శ్రీధర్ పై ఈర్ష్య పెంచుకొని ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు కారణం లేకపోలేదు.. సరిగ్గా నెల రోజుల క్రితం అమావాస్యరోజే షాప్ ముందు క్షుద్రపూజలు జరిపారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కాయి. అయితే ఆ క్షుద్రపూజలను షాపు యాజమాని పెద్దగా పట్టించు కోలేదు. కానీ నెల తిరిగే సరికి మళ్లీ అదే అమావాస్య రోజు షాపు మంట్లలో కాలిపోవడంతో శ్రీధర్‌ అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. క్షుద్రపూజలు నిర్వహించిన ఆ దుండగులే షాప్ దగ్ధం చేశారా..! లేక ప్రమాదవశాత్తు షాపులో మంటలు చెలరేగాయా, లేక క్షుద్రపూజల ప్రభావంతో మంటలు చెలరేగాయా..! అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు దుకాణం కాలిపోవడంతో జీవనోపాధి కోల్పోయి కుటుంబం రోడ్డున పడ్డామని; ప్రభుత్వం తనను ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అదరహో.. విమానాన్ని తలదన్నేలా వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌

గూగుల్‌ ఆఫీసులో నల్లుల బెడద

రిషికేష్‌లో బామ్మ సాహసం.. ఆమె ఏం చేసిందంటే

దొంగల్లో ఖతర్నాక్ దొంగ.. హుండీని ఎలా కొల్లగొట్టాడు చూడండి

మీరు లాప్‌టాప్‌తో విమానాశ్రయానికి వెళుతున్నారా ?? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి