ఓరి బుడ్డోడా.. మ్యాగీ కోసం ఎంత పనిచేశాడు

Updated on: Oct 07, 2025 | 7:35 PM

చిన్న పిల్లలనుంచి పెద్దల వరకు ఇష్టంగా తినే ఇన్‌స్టంట్‌ ఫుడ్‌ మ్యాగీ. ఆకలిగా ఉన్న సమయంలో రెండే నిమిషాల్లో సులువుగా తయారు చేసుకునే ఈ వంటకం అంటే అందరికీ ఇష్టం. ఇక.. చిన్నారులకు మ్యాగీ అంటే ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అలా మ్యాగీ అంటే ఎంతో ఇష్టపడే ఓ బాలుడు.. ఆరోజు మ్యాగీ కొనుక్కోడానికి డబ్బులు లేకపోవటంతో.. తన సోదరి బంగారు ఉంగరాన్ని అమ్మే ప్రయత్నం చేశాడు.

ఆ ఉంగరాన్ని తీసుకొని నేరుగా స్థానిక నగల దుకాణానికి వెళ్లి.. మ్యాగీ కొనుక్కోవటానికి డబ్బుల్లేవని, ఉంగరం తీసుకుని డబ్బు ఇవ్వాలని కోరాడు. అయితే.. దుకాణదారుడు వెంటనే బాలుడి తల్లిని పిలిపించి ఉంగరాన్ని అమెకు ఇచ్చాడు. దీంతో బుడ్డాడి పనికి అందరూ షాకవగా.. ఆ దుకాణదారుడి నిజాయితీని వారంతా మెచ్చుకుంటున్నారు. అదే సమయంలో.. నేటి పిల్లలు నూడుల్స్, ఫాస్ట్ ఫుడ్‌కి ఎంత అడిక్ట్‌ అవుతున్నారో ఈ సంఘటన స్పష్టం బయటపెట్టింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగింది. కాన్పూర్‌లోని శాస్త్రి నగర్‌కు చెందిన 13 ఏళ్ల బాలుడు స్థానిక నగల దుకాణానికి వెళ్లి ఓ బంగారపు ఉంగరాన్ని అమ్మజూపాడు. దీంతో.. దుకాణ యజమాని పుష్పేంద్ర జైస్వాల్ ఆ బాలుడి వివరాలు ఆరా తీశాడు. బాలుడి అమాయకత్వాన్ని చూసి ముచ్చట పడిన దుకాణం యజమాని.. ‘మరి.. ఆ ఉంగరం అమ్మిన డబ్బును ఏం చేస్తావ్?’ అని అడగగా.. ఆ బాలుడు ఎంతో నిజాయితీగా మ్యాగీ కొనడానికి డబ్బు లేకనే ఉంగరం అమ్ముతున్నానని, మీరిచ్చే డబ్బుతో బోలెడన్ని మ్యాగీ ప్యాకెట్లు కొనుక్కుంటా.. అని తనదైన శైలిలో జవాబిచ్చాడు. వెంటనే.. అసలు సంగతి అర్థమైన ఆ నగల వ్యాపారి వెంటనే ఆ అబ్బాయి తల్లిని దుకాణానికి పిలిచి ఆ ఉంగరాన్ని చూపించాడు. ఆ ఉంగరం చూసిన తల్లి షాక్ అయింది. అది తన కూతురి నిశ్చితార్థం కోసం కొన్న ఉంగరమని, కొద్ది రోజుల్లో తన కూతురి వివాహం జరగనుందని తెలిపింది. దీంతో, ఆ వ్యాపారి ఆ ఉంగరాన్ని బాలుడి తల్లికి తిరిగి ఇచ్చాడు. దుకాణదారు నిజాయితీకి ఆ తల్లి కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకుంది. అనంతరం ఆమె ఉంగరం తీసుకొని తన కొడుకుతో వెళ్లిపోయింది. కాగా, తన షాపులో డాక్యుమెంట్లు లేకుండా మైనర్లు తెచ్చిన వస్తువులను కొనుగోలు చేయమని దుకాణ యజమాని పుష్పేంద్ర జైస్వాల్ అన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉద్యోగులకు ఈపీఎఫ్‌ఓ గుడ్‌న్యూస్‌.. ఇకపై పీఎఫ్ సేవలు మరింత సులభం

అపర కుబేరుడు.. ఈ ఆటోవాలా.. నెలకు రూ. 3 లక్షల ఆదాయం

Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం.. ఇక పర్యాటకం పరుగులే

కంత్రీ పాక్‌ కన్నింగ్‌ ప్లాన్‌.. మన చాబహర్‌ పోర్టు పక్కనే అమెరికా పోర్టు

Samantha: విద్యార్ధులకు సమంత కీలక సూచన.. చదువుతోపాటు వాటిపై కూడా దృష్టి పెట్టాలి