ఏదో విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. దీంతో మహిళా ఉద్యోగిని తన ఫోన్లో దాన్ని రికార్డు చేయడం మొదలుపెట్టడంతో ఆ ప్రిన్సిపాల్ ఆగ్రహం కట్టలు తెంచుకొని ఆమెను చెంపదెబ్బ కొట్టి ఫోన్ లాక్కొని నేలపైకి విసిరేసింది. దీంతో ఆ ఉద్యోగిని అవాక్కై ఎంత ధైర్యం నాపైనే చేయచేస్తుకుంటావా అని ప్రశ్నించి తన ఫోన్ తీసుకోవడానికి వెళ్ళింది. ఆ ప్రిన్సిపాల్ మరోసారి ఫోన్ లాక్కొని నేలపైకి విసిరడంతో అది పగిలిపోయింది. దీంతో ఆ ఉద్యోగిని తిరుగుబడి ప్రిన్సిపాల్ చేతిపై కొట్టింది. ఇక ఇద్దరి మధ్య పూర్తి స్థాయి కొట్లాట మొదలైంది. పరస్పరం జుట్టు పట్టుకొని తన్నికున్నారు. అక్కడే ఉన్న ఓ మహిళ వారి కొట్లాటను అడ్డుకుంది. స్కూల్లో లేడీ స్టాఫ్ కొట్టుకున్న వీడియో ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్ళింది. ఇద్దరిని విధుల నుంచి తొలగించారు. అసిస్టెంట్ కమిషనర్ ప్రశాంత్ ఆర్య ఆఫీసుకు అటాచ్ చేశారు. లోతైన విచారణ జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సంఘటనపై వీలైనంత త్వరగా దర్యాప్తు జరపాలని ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ ను ఆదేశించారు.