రయ్య్‌మంటూ దూసుకెళ్తున్న డ్రైవర్‌లెస్‌ కారు

Updated on: Nov 01, 2025 | 11:05 AM

పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన డ్రైవర్ లెస్‌ కారు బెంగళూరులో ఆవిష్కృతమైంది. ఉత్తరాది మఠానికి చెందిన శ్రీసత్యాత్మతీర్థ స్వామీజీ డ్రైవర్ లెస్ కారులో ప్రయాణించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. RV ఇంజినీరింగ్ కాలేజీకి వచ్చిన ఆయన ఈ కారులో కొద్దిసేపు ప్రయాణించారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఆర్‌వీ కాలేజీ పరిశోధకులు, ఐటీ దిగ్గజం విప్రో లిమిటెడ్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ డ్రైవర్‌లెస్ కారును రూపొందించారు.

6 ఏళ్ల పాటు శ్రమించి AI, ML, 5G-ఆధారిత V2X కమ్యూనికేషను ఉపయోగించి ఈ కారును రూపొందించారు. భారతీయ పరిస్థితులకు అనుగుణంగా డ్రైవర్‌లెస్ కారును రూపొందించడానికి 6 సంవత్సరాలుగా చేసిన కృషి ఫలించింది. ముఖ్యంగా బెంగళూరులోని రోడ్లపై నావిగేట్ చేయడంలో ఉన్న అంశాలపై ముడి డేటాను సేకరించడానికి పరిశోధకులు బహుళ సెన్సార్లతో కూడిన కారును ఉపయోగించారు. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ నెట్‌వర్క్ కార్యక్రమంలో భాగంగా తయారు చేసిన డ్రైవర్ అవసరం లేని ఈ కారును దేశ రహదారుల పరిస్థితులకు అనుగుణంగా పరీక్షించి తీర్చిదిద్దుతున్నారు. పూర్తిగా సిద్ధమైన తర్వాత ఈ డ్రైవర్‌లెస్ కారును అధికారికంగా ప్రారంభించనున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Deepika Padukone: దీపికకు మరో షాకిచ్చిన కల్కి టీమ్

ఇదేం పని !! కర్నూలు బస్సు ప్రమాదం.. బూడిదలో బంగారం కోసం గాలింపు

స్వీట్స్‌ తయారీలో నిమగ్నమైన సిబ్బంది.. అంతలోనే ఊహించని సీన్‌

కూతురు చనిపోయి ఏడుస్తుంటే.. లంచాల కోసం జలగల్లా పీడించారు

కారులో మహిళ.. కళ్లు తెరిచేంతలోగా మృతి