తప్పిపోయిన రెండేళ్ల చిన్నారి.. జాగ్రత్తగా కాపాడిన శునకాలు

|

Sep 26, 2023 | 9:49 AM

ఇంటిముందు ఆడుకుంటూ తప్పిపోయిన చిన్నారిని పెంపుడు కుక్కలు జాగ్రత్తగా కాపాడి ఇంటికి చేర్చాయి. ఈ అద్భుత సంఘటన అమెరికాలోని మిచిగాన్‌లో జరిగింది. మిచిగాన్‌లోని ఫెయిత్‌ హార్న్‌కు చెందిన రెండేళ్ల చిన్నారి థియా చేజ్‌ సెప్టెంబర్‌ 20న రాత్రి 8 గంటల సమయంలో ఇంటిముందు తమ పెంపుడు కుక్కలతో ఆడుకుంటూ ఉంది. కుక్కలు అటవీ ప్రాంతం వైపు వెళ్తుంటే వాటితోపాటే చిన్నారి కూడా వెళ్లిపోయింది.

ఇంటిముందు ఆడుకుంటూ తప్పిపోయిన చిన్నారిని పెంపుడు కుక్కలు జాగ్రత్తగా కాపాడి ఇంటికి చేర్చాయి. ఈ అద్భుత సంఘటన అమెరికాలోని మిచిగాన్‌లో జరిగింది. మిచిగాన్‌లోని ఫెయిత్‌ హార్న్‌కు చెందిన రెండేళ్ల చిన్నారి థియా చేజ్‌ సెప్టెంబర్‌ 20న రాత్రి 8 గంటల సమయంలో ఇంటిముందు తమ పెంపుడు కుక్కలతో ఆడుకుంటూ ఉంది. కుక్కలు అటవీ ప్రాంతం వైపు వెళ్తుంటే వాటితోపాటే చిన్నారి కూడా వెళ్లిపోయింది. ఆ తర్వాత చిన్నారి కనిపించడంలేదని గ్రహించిన కుటుంబ సభ్యులు కుక్కలు కూడా కనిపించకపోవడంతో తీవ్ర భయాందోళన చెందారు. పోలీసులకు సమాచారమిచ్చారు. స్థానికులు, పోలీసులు అంతా కలిసి చుట్టు పక్కల అంతా వెతికారు. కానీ చిన్నారి జాడ కనిపించలేదు. డ్రోన్లు, పోలీస్‌ జాగిలాలతో ఎంత వెదికినా ప్రయోజనం లేకపోయింది. చివరికి ఆల్‌ టెర్రయిన్‌ వెహికల్‌ (ATV) చిన్నారి జాడను కనిపెట్టింది. అడవిలో ఓ చిన్నారి అర్ధరాత్రి సమయంలో ఒక కుక్కను తలదిండుగా పెట్టుకుని నిద్రిస్తోన్న దృశ్యాలు కనిపించాయి. మరో కుక్క జాగ్రత్తగా కాపలాకాస్తూ కనిపించింది. ఆ చిన్నారి ఇంటికి దాదాపు మూడు మైళ్ల దూరంలో ఈ దృశ్యం కనిపించింది. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ దృశ్యం చూసి పోలీసులు, స్థానికులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Elon Musk: ఎలాన్‌ మస్క్‌ చేతికి ఐఫోన్‌ 15.. ఫీచర్స్‌కు ఫిదా

పదేళ్ల బాలుడి సమయస్పూర్తి.. తప్పిన పెను ప్రమాదం

Ram Pothineni: నువ్వేమైనా పెద్ద ఫిగర్‌వా !! శ్రీలీలపై రామ్ సెన్సేషనల్ కామెంట్స్

శ్రీవారి బస్సునే ఎత్తుకెళ్లాలనుకున్నాడు.. చివరికి ??

Parineeti Chopra: పెళ్ళి పీటలపై బాలీవుడ్​ క్యూట్​కపుల్..