కట్టుకున్న భార్యకు మూడు పెళ్లిళ్లు చేయించిన భర్త..
మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో వింత ఉదంతం చోటుచేసుకుంది. స్థానికంగా ఇది సంచలనం సృష్టించింది. ఒక భర్త స్వయంగా తన భార్యకు మూడు పెళ్లిళ్లు చేయించాడు. దీని వెనుక బాగోతం తెలిసినవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. ఆ భర్త తన భార్య కోసం ఆర్థికంగా ఉన్నతస్థాయిలో ఉన్నవారి సంబంధాలు చూసేవాడు. ఆమె తన భార్య అని వారికి తెలియకుండా ఆమెకు పెళ్లి జరిపించేవాడు.
మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో వింత ఉదంతం చోటుచేసుకుంది. స్థానికంగా ఇది సంచలనం సృష్టించింది. ఒక భర్త స్వయంగా తన భార్యకు మూడు పెళ్లిళ్లు చేయించాడు. దీని వెనుక బాగోతం తెలిసినవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. ఆ భర్త తన భార్య కోసం ఆర్థికంగా ఉన్నతస్థాయిలో ఉన్నవారి సంబంధాలు చూసేవాడు. ఆమె తన భార్య అని వారికి తెలియకుండా ఆమెకు పెళ్లి జరిపించేవాడు. తరువాత ఆమె అత్తవారింటికి వెళ్లి, అక్కడ నగదు, నగలు మూటగట్టుకుని, భర్త దగ్గరకు వచ్చేసేది. తరువాత వారిద్దరూ కలసి అక్కడి నుంచి పరారయ్యేవారు. ఈ విధంగా సదరు భర్త ఆ భార్యకు మూడు పెళ్లిళ్లు చేశాడు. అయితే దొంగ వ్యవహారాలు ఎంతోకాలం దాగవన్నట్లు ఆ మహిళ పోలీసులకు పట్టుబడింది. తాము సాగిస్తున్న వ్యవహారాలన్నీ ఆమె పోలీసుల ముందు ఉంచింది. ఈ ఉదంతం గురించి పోలీసులు మీడియాకు తెలియజేస్తూ డబ్బు సంపాదనకు ఈ భార్యాభర్తలు జనాలను మోసం చేస్తుంటారన్నారు. భర్తే స్వయంగా భార్యకు పెళ్లి చేస్తూ, తాను ఆమెను సోదరుడినని పెళ్లివారిముందు నమ్మబలికేవాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చేపల పొట్టల్లో కొకైన్.. డ్రగ్స్‌తో బ్రెజిల్ తీరం కలుషితం
TOP 9 ET News: షాకింగ్ న్యూస్.. ‘డెవిల్’ కోసం మహేష్.. కానీ డైరెక్టరే..!| ఫారెన్ అమ్మాయితో దేవరకొండ
గేదెను చూపించి దానిమీద కూర్చోవాలన్నాడు.. డైరెక్టర్ చేసిన పనికి షాకైన హీరోయిన్..
Malaika Arora: 50 ఏళ్ల వయసులో.. ముచ్చటగా 3వ సారి ప్రేమలో పడిన మలైకా !!
Janhvi Kapoor: డబ్బులిచ్చి పొగిడించుకుంటావ్ !! హీరోయిన్ .. క్రేజీ ఆన్సర్ !!