ఆ ఊళ్లో మద్యం తాగినా, అమ్మినా రూ.2 లక్షల జరిమానా..

|

Dec 06, 2024 | 6:25 PM

ప్రభుత్వాలు చేయలేని పని ఆ గ్రామస్తులు చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పన్నెండేళ్లనుంచి ఆ గ్రామంలో మద్యపానం నిషేధం అమలు చేస్తున్నారు. ఈరోజుల్లో ఒక కుటుంబంలోని వ్యక్తులే ఒక్క మాటమీద ఉండటంలేదు. అలాంటిది ఆ గ్రామస్తులంతా ఏకగ్రీవంగా ఓ మంచి నిర్ణయం తీసుకోవడం.. పన్నెండేళ్లుగా ఏ ఒక్కరూ మాట తప్పకుండా మద్యనిషేధానికి కట్టుబడి ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

అవును మెదక్‌ జిల్లా అల్లదుర్గ్‌ మండలంలోని కాగిదంపల్లి గ్రామ ప్రజలు తమ కట్టుబాటుతో ఆదర్శంగా నిలుస్తున్నారు. కాగిదంపల్లి గ్రామంలో 12 ఏళ్లుగా పూర్తిగా మద్యపాన నిషేధం అమలు జరుగుతోంది. మద్యం తాగినా, విక్రయించినా జరిమానాతో పాటు ఇతర శిక్షలు వేస్తామని,గ్రామస్థులు అందరూ కలిసి దృఢ నిశ్చయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకోవడమే కాదు.. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు కూడా. గ్రామంలో ఒకవేళ ఎవరికైనా అలవాటు ఉంటే,అది మానుకునే వరకు ఇతర గ్రామాల్లో సేవించాలని నిబంధనలు విధించారు. ఇక ఆ గ్రామంలో ఎక్కడైనా మద్యం సీసా కనబడితే, సాయంత్రం రచ్చబండ దగ్గర పంచాయితీకి రావాల్సిందేనని హెచ్చరికలు కూడా జారీ చేశారు. పన్నేండేళ్ల క్రితం గ్రామంలో పూర్తిగా మద్య పానాన్ని నిషేధించాలని, గ్రామపెద్దలు మూకుమ్మడిగా నిర్ణయం తీసుకున్నారు. పుష్కరకాలంగా గ్రామస్తులంతా ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మాస్క్ పెట్టుకుంటే పులి పారిపోతుందా ??