లవర్ భార్యకు HIV ఇంజెక్షన్.. మాజీ ప్రియురాలి దారుణం

Updated on: Jan 27, 2026 | 9:40 AM

కర్నూలులో ఓ నర్సు తన మాజీ ప్రియుడి భార్యపై దారుణానికి ఒడిగట్టింది. తనను కాదని వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడనే కక్షతో, ఆమెకు హెచ్‌ఐవీ పాజిటివ్ రక్తాన్ని ఇంజెక్షన్ చేసింది. స్కూటీపై వెళ్తున్న మహిళా డాక్టర్‌ను ప్రమాదమని నమ్మించి, నలుగురు నిందితులతో కలిసి ఈ దారుణానికి పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ప్రేమించిన వ్యక్తి తనను కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే కక్షతో ఓ నర్సు దారుణానికి ఒడిగట్టింది. మాజీ ప్రియుడి భార్య అయిన మహిళా డాక్టర్‌కు హెచ్‌ఐవీ పాజిటివ్ రక్తాన్ని ఇంజెక్షన్ చేసింది. ఏం జరిగిందంటే.. కర్నూలులో మహిళా డాక్టర్ స్కూటీపై ఇంటికి వెళ్తున్నారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ సైకిల్ పై వచ్చి.. ఆమె స్కూటీని ఢీకొట్టారు. పక్కనే ఉన్న ముగ్గురు మహిళలు, ఓ వ్యక్తి పరుగున కింద పడ్డ డాక్టర్ దగ్గరకు వచ్చి.. సాయం చేస్తున్నట్లు నటించారు. ఆపై ఆమెను ఆటో ఎక్కిస్తామని చెప్పి మాటల్లో పెట్టి.. మహిళా డాక్టర్‌కు ఓ ఇంజెక్షన్ చేశారు.వారి చర్యలతో భయపడిన ఆ మహిళా డాక్టర్ గట్టిగా కేకలు వేశారు. తనపై విష ప్రయోగం జరిగి ఉంటుందని భావించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళా డాక్టర్ స్కూటీ పడిపోయిన ప్రాంతంలోని సీసీ కెమెరాలు, సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా నలుగురు నిందితులను గుర్తించి పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మంత్రాలయానికి చెందిన భూమా జశ్వంత్, శృతిలతో పాటు బీచుపల్లి బోయ వసుంధర అలియాస్ వేదవతి, కొంగె జ్యోతి ఉన్నారు. ఈ నలుగురిని విచారించగా దారుణ విషయాలు బయటకు వచ్చాయి. నిందితుల్లో ఒకరైన వసుంధర నర్సుగా విధులు నిర్వహిస్తోంది. గతంలో ఆమె ఓ వైద్యుడిని ప్రేమించింది. అయితే ఆ డాక్టర్ వసుంధరను కాదని.. బాధితురాలైన మహిళా డాక్టర్‌ను వివాహం చేసుకున్నాడు. దీంతో వసుంధర తన ప్రియుడిని పెళ్లి చేసుకున్న మహిళా డాక్టర్‌ పై ద్వేషం పెంచుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హెచ్‌ఐవీ రోగుల నుంచి.. నర్సుల సాయంతో హెచ్‌ఐవీ వైరస్‌తో కూడిన రక్తాన్ని సేకరించింది వసుంధర. తాజాగా పక్కా ప్లాన్‌తొ.. తన మాజీ ప్రియుడి భార్య అయిన డాక్టర్‌కు హెచ్ఐవీ రక్తాన్ని ఇంజెక్షన్ చేసిందనీ ఈ కేసులో నిందితురాలైన వసుంధర నర్సుపైనా.. హెచ్‌ఐవీ బాధితుల రక్తాన్ని అందించిన మిగతా నర్సులపై చర్యలు తీసుకుంటామని కర్నూలు డీఎస్పీ తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bangladesh: మొండికేసిన బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్! వరల్డ్ కప్ నుంచి అవుట్

కేదార్‌నాథ్, బదరీనాథ్ ప్యానల్ కీలక నిర్ణయం

తెలంగాణ భవన్ లో స్పెషల్ స్కిట్.. ఆయన పాత్ర చూస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే

Khammam: నేను చస్తే మీకు హ్యాపీనా? బోరున ఏడ్చేసిన గవర్నమెంట్ టీచర్ గౌతమి

Garimella Balakrishna Prasad: మరణానంతరం గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ కు పద్మశ్రీ పురస్కారం