ఇంకో అడుగు ముందుకెళితే అంతే
కర్నూలులో రెప్పపాటులో బాలుడు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. సీసీ టీవీ కెమెరాలో రికార్డయిన ఆదృశ్యాలు చూస్తే ఎవరికైనా గుండెజారినంత పనవుతుంది. ఇప్పుడు ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.భూమిపై నూకలు ఉన్నాయంటే ఇదేనేమో అనిపించే ఈ ఘటన కర్నూలు నగరంలో చోటుచేసుకుంది. నగరంలోని అశోక్‌నగర్‌లో కాలువల మరమ్మతు పనులు జరుగుతున్న సమయంలో, ఒక్కసారిగా రోడ్డుపై ఉన్న విద్యుత్ స్థంభం కూలిపోయింది.
అదే సమయంలో ఓ విద్యార్థి నడుచుకుంటూ అటుగా వెళ్తున్నాడు. అది చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకుగురయ్యారు. స్థంభం కూలుతున్న దృశ్యాన్ని ముందుగానే గమనించిన కొందరు స్థానికులు గట్టిగా కేకలు వేయడంతో, విద్యార్థి అప్రమత్తమై వెంటనే వెనక్కి పరుగెత్తాడు. ఒక్క సెకన్‌లో బాలుడు తప్పించుకున్నాడు. లేదంటే పెను ప్రమాదం జరిగేది. ఈ ఘటనలో విద్యార్థికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే విద్యుత్ స్థంభం కూలిన తీరు చూస్తే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉండేదో అర్థమవుతోంది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని, పాత విద్యుత్ స్థంభాల స్థితిగతులపై అధికారులు సమగ్రంగా సమీక్ష చేయాలని స్థానికులు కోరుతున్నారు. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుందని ఈ ఘటన తెలియజేస్తుంది.
మరిన్ని వీడియోల కోసం :