Hyderabad: ప్రాణం తీసిన బిర్యానీ.. అస్సలు ఏం జరిగిందంటే
న్యూ ఇయర్ పార్టీలో విషాదం చోటుచేసుకుంది. జగద్గిరిగుట్టలో బిర్యానీ తిని 17 మంది అస్వస్థతకు గురికాగా, ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమికంగా, కాలం చెల్లిన మసాలాలతో తయారుచేసిన బిర్యానీ ఫుడ్ పాయిజన్‌కు కారణమని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో పాండు అనే వ్యక్తి మృతి చెందారు.
బిర్యానీ ఒకరి ప్రాణం తీసింది. ఈ విషాద ఘటన కూకట్‌పల్లి సమీపంలోని జగద్గిరిగుట్టలో జరిగింది. న్యూ ఇయర్ సందర్భంగా తెలిసినవాళ్లంతా కలిసి నిన్న రాత్రి ఒక చోట చేరి పార్టీ చేసుకున్నారు. భవానీనగర్‌లోని కమ్యూనిటీ హాల్ దగ్గర అంతా కలిసి వండుకున్నారు. మద్యం తాగి బిర్యానీ తిని ఎంజాయ్ చేశారు. తీరా ఇంటికి వెళ్లాక ఒక్కొక్కరూ అస్వస్థతకు గురయ్యారు. పాండు అనే 53 ఏళ్ల వ్యక్తి ఇంట్లోనే ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 17 మందిలో ఒక్కరు చనిపోగా మిగతా వాళ్లు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రాథమికంగా ఫుడ్ పాయిజన్ వల్లే ఇలా జరిగినట్టు నిర్థారించుకున్నారు. కూరలు వండేప్పుడు అందులో వేసిన మసాలాలు, కారం లాంటివి ఎక్స్‌పైర్ అయిన ప్యాకెట్లు అయ్యుంటాయని అందుకే ఇలా జరిగి ఉంటుందని చెప్తున్నారు. వీళ్లంతా రాత్రి ఎక్కడ పార్టీ చేసుకున్నారు.. పోలీసులు విచారణలో ప్రాథమికంగా ఎలాంటి నిర్థారణకు వచ్చారనే దానిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ప్రణీత అందిస్తారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వందేభారత్.. 180 కి.మీ స్పీడ్.. గ్లాస్ వణకలేదు..నీళ్ళు తొణకలేదు
LPG Gas Cylinder: బిగ్ షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
రికార్డు స్థాయిలో జీఎస్టీ ఆదాయం.. డిసెంబరులో భారీ వసూళ్లు