Fun in Wedding: వారెవ్వా..! పెళ్లిలో బామ్మర్దుల సరదా సందడి.. మామూలుగా లేదుగా..!
పెళ్లిళ్ల సీజన్ కావడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జోరుగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అయితే అమలాపురంలో ఓ పెళ్లిలో కాబోయే బావతో బామ్మర్దులు చేసిన సందడి అంతా ఇంత కాదు..
పెళ్లిళ్ల సీజన్ కావడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జోరుగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అయితే అమలాపురంలో ఓ పెళ్లిలో కాబోయే బావతో బామ్మర్దులు చేసిన సందడి అంతా ఇంత కాదు.. పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు చూసి నవ్వులు పువ్వులు పూయిస్తూ మంత్రముగ్ధులయ్యారు. పెళ్లికొడుకు కళ్యాణ మండపం వచ్చిన తర్వాత పెళ్లి మండపంలో జరిగే ఒక తంతు తెగ ఆకట్టుకుంది. వరుడు కాశీయాత్రకు వెళ్లే సన్నివేశంలో బామ్మర్దులు బావ నువ్వు కాశీయాత్రకు వెళ్లొద్దు.. మా చెల్లి నుంచి పెళ్లి చేస్తా మా చెల్లితో ఉండు.. అంటూ కాళ్లు కడిగి పెళ్లికొడుకుని మండపంలో తీసుకొచ్చారు. బామ్మర్దులు ఏకంగా కాబోయే బావను చేతులతో ఎత్తుకుని పెళ్లి మండపంలోకి తీసుకువచ్చారు. ఈ సన్నివేశాన్ని కళ్యాణ మండపంలో ఉన్న ఇరువురి బంధుమిత్రులు అందరూ ఎంజాయ్ చేశారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో షేర్ చేయడంతో మోస్ట్ ట్రెండింగ్ వీడియోగా మారి.. తెగచక్కర్లు కొడుతోంది. కోనసీమ ఆతిథ్యమే కాదు.. కోనసీమలో జరిగే పెళ్లిళ్లు కూడా చాలా అద్భుతంగా ఉంటాయంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!