భారీ ఉడుమును అమాంతం మింగేందుకు యత్నించిన కళింగ పాము.. చివరకు !!

|

Sep 17, 2022 | 8:34 PM

కళింగ పాములు చాలా అరుదుగా కనిపిస్తాయి. పాముల్లో కింగ్‌గా దీనికి పేరుంది. ఈ జాతి పాములు చాలా డేంజరస్. చాలా పొడవుగా ఉంటాయి. కర్ణాటకలో ఇవి తరచుగా కనిపిస్తాయి.

కళింగ పాములు చాలా అరుదుగా కనిపిస్తాయి. పాముల్లో కింగ్‌గా దీనికి పేరుంది. ఈ జాతి పాములు చాలా డేంజరస్. చాలా పొడవుగా ఉంటాయి. కర్ణాటకలో ఇవి తరచుగా కనిపిస్తాయి. తాజాగా బాగా ఆకలితో ఉన్న ఓ భారీ కళింగ పాము.. ఓ ఉడుమును వేటాడింది. మాటు వేసి దాన్ని పట్టేసింది. అయితే దాన్ని మింగేందుకు మాత్రం ఆపసోపాలు పడింది. కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. సిర్సి సమీపంలో యానా క్రాస్ రోడ్డు సమీపంలోని ఓ మరుగు ప్రాంతంలో ఉడుమును నోటబట్టిన సర్పం.. దాన్ని మింగేందుకు దాదాపు గంటపాటు విశ్వప్రయత్నం చేసింది. అయితే ఉడుము సైజ్ కూడా పెద్దదిగా ఉండటంతో.. పాము దానిని మింగలేకపోయింది. చివరికి దాన్ని వదిలిపెట్టింది. అయితే అప్పటికే ఊపిరాడక ఉడుము మరణించింది. ఈ షాకింగ్ దృశ్యాలను అటుగా వెళ్లే బైక్ రైడర్ ఫోన్‌లో షూట్ చేశాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. వైరల్‌గా మారాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టార్చ్ లైట్ల వెలుగులోనే రోగులకు చికిత్స.. ఎక్కడో తెలుసా ??

Published on: Sep 17, 2022 08:34 PM