ఐస్‌క్రీమ్ కాదు ‘ఎసుకిమో’ కిమ్ …పిచ్చి పీక్స్‌కు వీడియో
కొరియా అధ్యక్షుడు కిమ్ రూటే సెపరేటు.. అందరూ ఎడ్డెం అంటే .. ఆయన తెడ్డెం అంటారు. ప్రజలు ఏం తినాలి? ఎలాంటి బట్టలు వేసుకోవాలి? అనేది కూడా ఆయనే శాసిస్తారు. లేటెస్ట్‌గా ఆయనకు ఐస్ క్రీమ్ మీద ఎందుకో కోపం వచ్చింది. వెంటనే దాని పేరునే మార్చేశారు. పనిలో పనిగా మరికొన్ని పదార్థాల పేర్లను కూడా మార్చేసారు. దేశ సాంస్కృతిక పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కిమ్ సర్కారు ప్రకటించింది. .
ప్రపంచంలో ఎక్కడైనా ‘ఐస్‌క్రీమ్’ని అదే పేరుతోనే పిలుస్తారు. కానీ, కిమ్‌కు ఈ విదేశీ పేరు నచ్చలేదట. పైగా, దీనివల్ల విదేశీ ప్రభావం తమ ప్రజలపై పడుతుందని అనిపించిందట. ఇంకేముంది.. వెంటనే దాని పేరును.. కొరియన్ భాషలో.. ‘ఎసుకిమో’గా పిలవాలంటూ.. ప్రకటించేశారు. దక్షిణ కొరియా, అమెరికా సహా పశ్చిమ దేశాల పదప్రయోగాన్ని పూర్తిగా తొలగించడమే లక్ష్యంగా కిమ్ వ్యవహరించారు. మంచు ఎడారుల్లో నివసించే.. ఎస్కిమో అనే జాతి పేరుకు దగ్గరగా.. కిమ్ పెట్టిన కొత్త పేరు ఉండటంతో పలువురు ఇదెక్కడి గోల అంటూ తలపట్టుకుంటున్నారు. అలాగే హామ్‌బర్గ్ పేరును ..ఇకపై ‘డాజిన్-గోగి గియోపాంగ్’గా పిలవాలని కిమ్ ఆదేశించారు. దీని అర్ధం బీఫ్‌తో రెండు బ్రెడ్లు. తమ దేశంలో ఉన్నప్పుడు టూరిస్ట్‌లు ఇంగ్లిష్ పదాలు మాట్లాడకుండా ఈ నిర్ణయం తీసుకొన్నారు. అంతటితో ఆగకుండా.. విదేశీ టూరిస్ట్‌లతో మాట్లాడేటప్పుడు లోకల్ గైడ్స్.. ఇంగ్లిష్ పదాలు రాకుండా వారికి శిక్షణా కార్యక్రమం కూడా ప్రారంభించించారు. దీంతో గైడ్లు షాకవుతున్నారు. ఇంగ్లీష్ మాట్లాడకుంటే విదేశీ పర్యటకులకు ఎలా కమ్యూనికేట్ చేస్తామని తలలు పట్టుకుంటున్నారు. అయితే.. అధ్యక్షుడు ఆదేశించాక చేయకపోతే.. గోక్కోవటానికి తలలు ఉండవని తెలిసి కిమ్ నిర్ణయాన్ని కిమ్మనకుండా అమలుచేస్తున్నారు.
మరిన్నివీడియోల కోసం :
భయం లేదు.. అప్రమత్తంగా ఉంటే చాలు వీడియో
