వ్యాపారులు వినూత్న ఆఫర్.. లక్కీ డ్రా తీయండి.. కూరగాయలు ఉచితంగా పొందండి

Edited By:

Updated on: Apr 23, 2026 | 8:48 PM

ఖమ్మం జిల్లాలో ఓ కూరగాయల వ్యాపారి విక్రయదారులను ఆకర్షించడానికి వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రతి కొనుగోలుపై కూపన్లు ఇచ్చి, లక్కీ డ్రా ద్వారా విజేతలకు వారం రోజులు ఉచిత కూరగాయలు అందిస్తున్నారు. ఈ ఆఫర్ కారణంగా కస్టమర్లు పెద్ద ఎత్తున వస్తున్నారు. తక్కువ ధర, నాణ్యతతో పాటు ఉచిత కూరగాయలు పొందే అవకాశం వినియోగదారులను ఆకర్షిస్తోంది.

విక్రయదారులను ఆకర్షించేందుకు కూరగాయల వ్యాపారులు కొత్త బాట పడుతున్నారు.తన వద్ద కూరగాయలు కొనుగోలు చేసిన వారికి కూపన్లు ఇచ్చి లక్కీ డ్రా లో గెలిచిన వారికి వారం రోజుల పాటు కూరగాయలు ఉచితంగా అందిస్తున్నరు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని నాయుడుపేట వద్ద ఓ కూరగాయల వ్యాపారి వినియోగదారుల కోసం ఓ వినూత్నమైన ఆఫర్ను ప్రకటించారు.కస్టమర్లు తమ వద్ద కూరగాయలు కొన్న ప్రతిసారీ వారి ఫోన్ నెంబర్,అడ్రస్ తో కూడిన కూపన్ను బాక్స్ లో వేయాలి. ప్రతి సోమవారం లక్కీ డ్రా తీసి అందులో విజేతగా నిలిచిన వ్యక్తికి వారం రోజుల పాటు రోజుకు ఒక కిలో చొప్పున కూరగాయలను ఉచితంగా అందజేస్తున్నారు. ఈ వినూత్న కూపన్ ఆఫర్ కారణంగా ఆ వ్యాపారి వద్ద కూరగాయలు కొనేందుకు పెద్ద ఎత్తున వస్తున్నారు.తక్కువ ధరకే నాణ్యమైన సరుకుతో పాటు, అదృష్టం బాగుంటే వారం రోజులు ఫ్రీగా కూరగాయలు దొరుకు తుండటంతో వినియోగదారులు ఈ ఆఫర్ పై ఆసక్తి చూపుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్ ఎంబీబీఎస్

నా చీర లాగాడు !! నాసిక్‌ టీసీఎస్ ఉద్యోగిని ఆవేదన

లంచం తీసుకుంటూ పట్టుబడిన స్టేట్‌ టాపర్‌

సర్ప్రైజ్ గిఫ్ట్ అని పిలిచింది.. కుర్చీకి కట్టేసి మరీ.. అలా ఎలా చేసింది

విచారణకు వచ్చి.. నగలు కొట్టేసిన పోలీసులు

Loading...
Unable to load recommendations.
Follow Us