120 అడుగుల ఎత్తులో గాల్లో ఇరుక్కుపోయిన టూరిస్టులు.. ఏం జరిగిందంటే

Updated on: Dec 02, 2025 | 7:49 PM

కేరళలోని ఇడుక్కి జిల్లా అనాచల్‌లో స్కై-డైనింగ్ క్రేన్ సాంకేతిక లోపంతో ఆకాశంలో 150 అడుగుల ఎత్తులో పర్యాటకులు చిక్కుకుపోయారు. ప్రాణభయంతో రెండు గంటలపాటు గడిపిన కుటుంబం, స్థానికుల సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సమయానికి చేరుకొని సురక్షితంగా రక్షించారు. ఈ ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కేరళలోని ఇడుక్కిలోని అనాచల్‌లో షాకింగ్‌ ఘటన జరిగింది. ఓ ప్రైవేట్ స్కై-డైనింగ్ వద్ద ఓ క్రేన్‌లో సాంకేతిక వైఫల్యం తలెత్తింది. దీంతో అనేక మంది పర్యాటకులు భూమికి దాదాపు 120 అడుగుల ఎత్తులో ఆకాశంలో ఇరుక్కుపోయారు. గంటన్నరకు పైగా ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ అక్కడే గడిపారు. మున్నార్ సమీపంలో శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని గాల్లో వేలాడుతున్న పర్యాటకులను సురక్షితంగా కిందకు దించారు. శుక్రవారం అనాచల్ సమీపంలోని స్కై-డైనింగ్ రెస్టారెంట్‌లోకి ఒక కుటుంబం వెళ్లింది. అయితే ఆ క్రేన్ పనిచేయకపోవడంతో 150 అడుగుల ఎత్తులో వారు చిక్కుకుపోయారు. రెండు గంటలపాటు వారు అక్కడే ఉండిపోయారు. దీంతో ఆ కుటుంబం భయాందోళన చెందింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్‌ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. తాళ్ల సహాయంతో 150 అడుగుల ఎత్తులో ఉన్న ‘స్కై-డైనింగ్’ రెస్టారెంట్‌ పైకి ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. తొలుత ఇద్దరు పిల్లలను, ఆ తర్వాత వారి తల్లిని చివరకు తండ్రితో పాటు రెస్టారెంట్‌ మహిళా సిబ్బందిని సురక్షితంగా కిందకు దించారు. మరోవైపు ఆ కుటుంబం కోజికోడ్‌కు చెందినట్లు రెస్టారెంట్‌ మహిళా సిబ్బంది తెలిపార. అయితే స్కై-డైనింగ్ రెస్టారెంట్‌లో టూరిస్టులు చిక్కుకోవడంపై నిర్వాహకులు తమకు సమాచారం ఇవ్వలేదని పోలీసులు, ఫైర్‌ సిబ్బంది ఆరోపించారు. స్థానికుల ద్వారా తెలుసుకుని అక్కడకు చేరుకున్నట్లు తెలిపారు. కాగా, ఈ రెస్క్యూకు సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అలాంటి స్లీపర్ బస్సులు రద్దు.. NHRC స్ట్రాంగ్ వార్నింగ్

సౌదీలో దుమ్మురేపిన హైదరాబాదీ.. WRC3లో రెండో స్థానంలో నిలిచిన నవీన్ పులిగిల్ల

బర్త్ డే పార్టీలో గన్ ఫైర్.. క్షణాల్లోనే నలుగురు

తుని ఆస్పత్రిలో వైద్యుల నిర్వాకం.. యువకుడి కాలులో అది పెట్టేసి కుట్టేసారు..

కాఫీలు తాగారా? టిఫినీలు చేశారా? పెళ్లిలో యువతుల హడావుడి.. చివరికి