Kerala: 101 ఏళ్ల కేరళ వృద్ధ విద్యార్థిని కన్నుమూత.! పోటెత్తుతున్న సంతాపం.

|

Oct 16, 2023 | 10:36 AM

తిరువనంతపురం: వయోజనులకు ఉద్దేశించిన కేరళ అక్షరాస్యత కార్యక్రమంలో పాల్గొని, 96 ఏళ్ల వయసులో నాలుగో తరగతి తత్సమాన ‘అక్షరలక్షం’ పరీక్షలో రాష్ట్రంలోనే అత్యధిక మార్కులు సాధించి చరిత్ర సృష్టించిన కార్త్యాయని అమ్మ మంగళవారం తుది శ్వాస విడిచారు. కొన్నాళ్లుగా పక్షవాతంతో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యారు. మరణించే నాటికి ఆమె వయసు 101 ఏళ్లు.