కదులుతున్న రైలు నుంచి మహిళను కాలితో తన్ని తోసేసి

Updated on: Nov 06, 2025 | 4:23 PM

కేరళలో దారుణం జరిగింది. ఆదివారం రాత్రి ఒక మహిళ తన స్నేహితురాలితో కలిసి తిరువనంతపురం వెళ్లేందుకు అలువా రైల్వే స్టేషన్‌లో కేరళ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కింది. రాత్రి 8.30 గంటల సమయంలో రైలు బయలుదేరింది. మహిళ, ఆమె స్నేహితురాలు టాయిలెట్‌కు వెళ్లి బయటకు వచ్చారు.

దీంతో రైలు పట్టాల పక్కన ఆమె పడింది. మహిళ స్నేహితురాలిని కూడా రైలు నుంచి బయటకు తోసేందుకు ఆ వ్యక్తి ప్రయత్నించాడు. కానీ, ఆమె హ్యండిల్‌ను గట్టిగా పట్టుకుని వేలాడింది. ఈ లోగా ఇదంతా గమనించిన కొందరు ఆమెను లోపలకు లాగి కాపాడారు. ఆ వ్యక్తిని పట్టుకుని రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రయాణికుల సమాచారంతో రైల్వే పోలీసులు వేగంగా స్పందించారు. వర్కళ రైల్వే స్టేషన్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో రైలు పట్టాల వద్ద పడిన ఆ మహిళను గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఆమెను తొలుత సమీపంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం తిరువనంతపురం మెడికల్ కాలేజ్‌ హాస్పిటల్‌కు తరలించారు. రైలు నుంచి పడిపోయిన ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు రైల్వే పోలీస్‌ అధికారి తెలిపారు. నిందితుడైన సురేష్‌ను కొచువేలి స్టేషన్‌లో అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. అతడు మద్యం సేవించి ఉన్నట్లు గుర్తించామన్నారు. మహిళ స్నేహితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ.. రన్‌వే అవసరం లేని విమానం

టెన్త్‌ అర్హతతో రైల్వే ఉద్యోగం.. రాత పరీక్ష లేకుండానే

అయ్యో..రక్షించేవారే లేరా.. ఏనుగుల ఆక్రందన

టీచర్లు కాదు.. రాక్షసులు.. బాలుడి ప్యాంటులో తేలును వదిలి ..

ట్యూషన్‌ నుంచి ఇంటికి వస్తున్న బాలుడు..ఊహించని విధంగా