చేతులు వణికే రోగం ఉన్నా.. అద్భుత కళాఖండాల సృష్టి..! కేరళ వ్యక్తి అద్భుతం..:Kerala Shiji Video.

|

Aug 18, 2021 | 12:30 PM

ఒక వ్యక్తికి శరీరం, చేతులు వణికే రోగం ఉన్నప్పటికీ అద్భుతమైన కళాఖండాలు సృష్టిస్తున్నాడు. కేరళలోని కొచ్చికి చెందిన శిజీకి చిన్నప్పటి నుంచి శరీరం, చేతులు వణుకుతాయి. అయితే శిజీ తన శారీరక లోపాన్ని అధిగమించి అద్భుతమైన కళాఖండాలు తయారు చేస్తున్నాడు...

శరీరం వణికే వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తి.. అద్భుతమైన కళాఖండాలు సృష్టించాడు. కేరళలోని కొచ్చికి చెందిన శిజీకి చిన్నప్పటి నుంచి శరీరం, చేతులు వణుకుతాయి. అయితే అతడి సోదరులు ఆయనకు సూక్ష్మ కళను నేర్పించారు. దీంతో శిజీ తన శారీరక లోపాన్ని అధిగమించి అద్భుతమైన కళాఖండాలు తయారు చేసి, శభాష్‌ అనిపించుకుంటున్నాడు. ఇంతకీ అతడు చేసిన, ఆ అద్భుతమైన ఫీట్‌ ఏంటో మీరే చూడండి.!
సృజనాత్మకతో శిజీ చేసిన హెలీకాప్టర్‌, యుద్ధ నౌక, డబుల్‌ డెక్కర్‌ బస్సు, ఆటో రిక్షా, బస్సు, వ్యాను, తాజ్‌మహల్‌ వంటి ఎన్నో ఆకట్టుకుంటున్నాయి. ప్యాకింగ్ బాక్సులు, చిన్న పైపులు, చిన్న సీసాలు, వాటి మూతలను ఉపయోగించి ఈ కళాకృతులను తయారు చేసినట్లు తెలిపాడు. ఎంతగానో ఆకట్టుకుంటున్న శిజీ అద్భత కళాఖండాలను చూసి పలువురు అతడ్ని ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఫుల్‌ వైరల్‌ అవుతున్నాయి.

YouTube video player
మరిన్ని ఇక్కడ చూడండి : ఆఫ్గనిస్తాన్ అల్లకల్లోలం.. ఆఫ్గనిస్తాన్‌లో చిక్కుకున్న తెలుగువాళ్ళు ఎయిర్‌పోర్ట్ కూడా రాలేని పరిస్థితి..:Afghanistan Crisis Live Video.

 ఆ రాష్ట్రంలో వేగంగా వ్యాప్తి చెందే డెల్టా ప్ల‌స్ వేరియంట్.. మళ్ళీ లాక్ డౌన్..? పూర్తి వివరాలు ఇలా :Delta Plus Variant Video.

 ఆ షాప్ ముందు భారీ క్యూ.. ఎందుకో తెలిస్తే షాక్.. వైరల్ అవుతున్న వీడియో..:Long Queues at Kolkata Video.

 ఇదేం మాస్క్ సామీ..ఎన్నడూ చూడని న్యాచురల్ మాస్క్.. మొక్కలను గాజు పెట్టెలో పెట్టి మరీ..:Grass Mask Video.

Published on: Aug 18, 2021 10:33 AM