పెళ్లిళ్లు ఆపేసిన మేకలు, గొర్రెలు.. కారణం ఇదే
సాధారణంగా పెళ్లిలో ఇరుపక్షాల మధ్య ఏవైనా గొడవలు వచ్చి వివాహం ఆగిపోవడం చూశాం.. కానీ కేవలం గొర్రెలు, మేకలు లేవని పెళ్లిళ్లు ఆగిపోవడం ఎక్కడైనా చూశామా? కానీ జమ్ముకాశ్మీర్‌లో అదే జరుగుతోంది. అక్కడ ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. పెళ్లంటే ఏ ప్రాంతంలోనైనా అదిరిపోయే విందు ఉండాల్సిందే. ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయకమైన వంటకం ఉన్నట్లే.. జమ్ము కశ్మీర్‌లో వాజ్వాన్ అనే మాంసాహార వంటకం లేని పెళ్లి జరగనే జరగదు.
ఎన్ని ఐటెమ్స్ వడ్డించినా వాజ్వాన్ లేనిదే.. ఆ విందు పరిపూర్ణం కాదు. అదే ఇప్పుడు కాశ్మీరీలకు అదే పెద్ద సమస్యగా మారింది. భారీ వర్షాలు, వరదల కారణంగా కొండచరియలు విరిగిపడుతుండటంతో శ్రీనగర్-జమ్ము నగరాలను కలిపే జాతీయ రహదారి 44ను మూసేశారు. గత 15 రోజులుగా ఆ రోడ్డు మూతపడి ఉంది. దాంతో కశ్మీర్‌కు గొర్రెలు, మేకల సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా మాంసానికి తీవ్ర కొరత ఏర్పడింది. రోడ్డు మూతపడటంతో గొర్రెలు, మేకల సరఫరా నిలిచిపోయిందని, తమకు ముందస్తు ఆర్డర్లు ఇచ్చిన వారికి మాంసం సరఫరా చేయలేకపోతున్నామని, వారు పెళ్లిళ్లను వాయిదా వేసుకోవాలని జమ్మూకశ్మీర్ మటన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఖజీర్ మొహమ్మద్ చెప్పారు. మరో వారం రోజుల దాకా రోడ్ బాగయ్యే పరిస్థితి లేకపోవటంతో చాలామంది పెళ్లిళ్లను వాయిదా వేసుకున్నారని ఆయన తెలిపారు. సాధారణ రోజుల్లో ఢిల్లీ, పంజాబ్, హర్యానాల నుంచి నిత్యం 50 ట్రక్కుల గొర్రెలు కశ్మీర్‌కు సరఫరా అవుతాయి. ఏటా రూ.4,000 కోట్ల మాంసం వ్యాపారం తాము చేస్తుండగా, ఇందులో పెళ్లిళ్ల వాడకం రూ.1,500 కోట్ల దాకా ఉంటుందని ఖజీర్ మొహమ్మద్ తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో నవంబరులో చలిగాలుల తీవ్రత పెరుగుతుందని, అందుకే అక్టోబరులోపే ఇక్కడ వివాహాలు ముగుస్తాయని వివరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nepal: నెపో కిడ్ ఉద్యమం వెనుక ఆ వ్యక్తి
మా హోటల్‌కు నిప్పు పెట్టారు.. కాపాడండి ప్లీజ్.. నేపాల్ లో భారత మహిళ ఆవేదన
Robbery: రూ. 4 కోట్ల లగ్జరీ కారు చోరీ.. కనిపెట్టిన చాట్‌జీపీటీ
రోడ్డుపై చెత్త వేస్తున్న వ్యక్తి. మున్సిపల్ అధికారులు ఏం చేశారంటే