ఆ ఆలయంలో ఎలుకలే దేవుళ్లు..!

Updated on: Nov 09, 2025 | 2:18 PM

రాజస్థాన్‌లోని దేశ్‌నోక్‌లో ఉన్న కరణీమాత ఆలయం ఎలుకల పూజకు ప్రసిద్ధి. ఇక్కడ 25,000 పైగా ఎలుకలు (కాబాలు) స్వేచ్ఛగా తిరుగుతాయి, వాటిని పవిత్రంగా భావిస్తారు. భక్తులు ఎలుకలు తిన్న ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. ప్రధాని మోదీ సందర్శనతో ఈ ఆలయం మరింత ప్రాచుర్యం పొందింది, ఇది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవం.

రాజస్థాన్‌లోని ఓ ఆలయంలో ఎలుకలను దేవుళ్లుగా పూజిస్తారు. ఆలయ అధికారులు వాటిని ఎంతో జాగ్రత్తగా సంరక్షిస్తారు. ఎలుకలు తిన్న ఆహారాన్ని స్థానిక భక్తులు ప్రసాదంగా తీసుకుంటారు. ఈ ఆలయాన్ని ప్రధాని నరేంద్రమోదీ కూడా సందర్శించారు. అప్పటి నుంచి ఈ ఆలయం మరింత ప్రసిద్ధి చెందింది. అదే కరణీమాత ఆలయం. ఇది రాజస్థాన్‌లో ఉంది. రాజస్థాన్‌ బికనీర్‌ జిల్లా దేశ్నోక్‌లో ఈ కరణీమాత ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఎలుకలను పూజించడం విశేషం. అందుకే ఇది ఎలుకల ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఎలుకలను కాబాలు అని పిలుస్తారు. దీనిని 20వ శతాబ్దంలో బికనీర్‌ మహారాజు గంగాసింగ్‌ నిర్మించారు. కరణీమాత 15వ శతాబ్ధానికి చెందిన సాధువు. ఆమె ఫలోదీ సమీపంలోని సువాప్‌ గ్రామంలో జన్మించింది. స్థానికుల కథనం ప్రకారం.. కరణీమాత కుమారుడు.. కోలాయత్‌ తహసీల్‌లోని కపిల సరోవర్‌ సరస్సులో నీరు తాగేందుకు వెళ్లి నీటిలో మునిగిపోయాడు. తన కుమారుడ్ని బ్రతికించమని యమధర్మరాజును వేడుకుంది కరణీమాత. అందుకు యముడు కరణీమాత పుత్రుడు ఎలుకగా పునర్జన్మ పొందుతాడని దీవించాడు. అలా కరణీమాత వారసులు ఎలుకలుగా జన్మించసాగారు. ఈ ఎలుకలను పవిత్రంగా భావిస్తారు. 20 వేలమంది సైన్యం దేశ్నోక్‌పై దాడి చేయగా.. కరణీమాత వారిని ఎలుకలుగా మార్చిందని మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఆలయంలో ఉన్న కాబాలు ఈ ఎలుకలేనని నమ్ముతారు. ఈ ఆలయంలో సుమారు పాతికవేల వరకూ ఎలుకలున్నాయట. ఇవి ఆలయ ప్రదేశమంతా స్వేచ్ఛగా తిరుగుతాయి. తిరుగుతాయి. వాటిని ఆలయ అధికారులు సంరక్షిస్తూ ఉంటారు. భక్తులు ఎలుకలు తిన్న ఆహారాన్ని ప్రసాదంగా తీసుకుంటారు. ఇక్కడి తెల్ల ఎలుకలు కరణీమాత కుమారులని నమ్ముతారు. పండుగల సమయంలో ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆఫ్రికన్‌ నత్తల దండయాత్ర.. మొక్కలు, తోటల విధ్వంసం

పెరట్లో కలుపు మొక్కలున్నాయా ?? జాగ్రత్త !!

నెల రోజుల పాటు ఉదయాన్నే ఈ నీరు తాగండి.. ఫలితం మీరే చూడండి

వీడు మామూలోడు కాదు.. హెల్మెట్‌కు బదులుగా మూకుడు

సముద్ర తీరంలో వింత జీవులు..