కరెంట్‌ ఆఫీసులో వింత జంతువు..అటవీ సిబ్బంది చూసి..

Updated on: Nov 28, 2025 | 1:48 PM

కరీంనగర్ వావిలాలపల్లిలో ఓ నక్క కలకలం రేపింది. మొదట పిల్లి అనుకున్న స్థానికులు, అటవీ శాఖకు సమాచారమివ్వడంతో అది నక్కగా గుర్తించారు. అది అటవీ సిబ్బందికి చిక్కకుండా తప్పించుకుంది. కొండలు మాయం కావడంతో వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయని స్థానికులు అంటున్నారు. నక్కను చూసిన ప్రజలు అదృష్టంగా భావిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వావిలాలపల్లిలో వింత జంతువు కలకలం రేపింది. గత రెండు రోజులుగా వావిలాలపల్లిలోని ఓ సోలార్ విద్యుత్ కార్యాలయం వద్ద ఈ జంతువు తిరుగుతూ కనిపించింది. తొలుత స్థానికులు దీన్ని పిల్లి అనుకొని ఆహారం, నీళ్లు పెట్టారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న అటవీ అధికారులు.. ఆ వింత జంతువును నక్కగా గుర్తించారు. నక్కను పట్టుకునే ప్రయత్నం చేశారు కానీ అది అటవీ సిబ్బందికి చిక్కకుండా చాకచక్యంగా తప్పించుకుని శివారు ప్రాంతం వైపు పారిపోయింది. ఈ నక్క జనావాసాల్లోకి ఎలా చేరిందనే విషయం స్పష్టత లేదు. కొండలు, గుట్టలు క్రమంగా మాయమవుతుండడంతో వన్యప్రాణులు ఇలా గ్రామాల్లోకి చొరబడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. కథల్లో జిత్తులమారి నక్కగా చెప్పుకునే ఈ జంతువును దగ్గరగా చూసే అవకాశమొచ్చిందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా నక్క తోకను తొక్కినా, నక్క ఇంటికి వచ్చినా అదృష్టం కలుగుతుందని ప్రజల్లో నమ్మకం ఉండటంతో.. అది తమ కార్యాలయానికి వచ్చినందుకు యజమాని జలేందర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో వ్యాపారంలో మంచి జరుగుతుందనే నమ్మకం కలిగిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. స్థానికులు కూడా మొదటిసారి నక్కను ప్రత్యక్షంగా చూశామని చెబుతూ, ఈ అరుదైన అతిథిని సెల్‌ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. వావిలాలపల్లిలో నక్క ప్రత్యక్షం… గ్రామంలో పెద్ద చర్చగా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శబరిమల యాత్రికులకు గుడ్‌ న్యూస్‌..! భోజనంలో మార్పు

వృద్ధులకు గుడ్‌న్యూస్‌..! భారీగా పెరిగిన ఆయుష్మాన్ భారత్ హెల్త్‌ కవరేజ్‌

బంగారం కొంటున్నారా.. బీకేర్‌ఫుల్‌ తక్కువ క్వాలిటీ బంగారంపై ప్యూరిటీ ముద్ర

తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలపై టిటిడి క్లారిటీ.. ఈసారి స్థానికులకు ఇంపార్టెన్స్

రాత్రి వేళ ఆస్పత్రికి వచ్చిన వృద్ధుడు.. కట్‌చేస్తే.. అంత బట్టబయలు