ఫ్రైడ్ రైస్‌లో బొద్దింకషాకైన కస్టమర్లు

Updated on: Nov 12, 2025 | 5:27 PM

కరీంనగర్‌లోని మైత్రి రెస్టారెంట్‌లో ఓ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. ఆర్డర్ చేసిన ఫ్రైడ్ రైస్‌లో బొద్దింక, వెంట్రుకలు బయటపడటంతో షాకయ్యారు. దీనిపై ఫిర్యాదు చేయగా రెస్టారెంట్ యాజమాన్యం నిర్లక్ష్యం వహించింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా స్పందించకపోవడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బయట ఆహారం నాణ్యత, పరిశుభ్రత ప్రమాదాలపై ఈ ఘటన ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్.

సెలవు రోజు ఏదో సరదాగా కుటుంబ సభ్యులకు బయట ఫుడ్ తినిపిద్దామని వెళ్లిన ఓ వ్యక్తికి ఊహించని షాక్ ఎదురైన ఘటన కరీంనగర్‌లో జరిగింది. వేములవాడకు చెందిన రాజు కుటుంబం కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్ సమీపంలోని మైత్రి రెస్టారెంట్ కి వెళ్లింది. తర్వాత రోటీలతో ఇతర కర్రీస్, వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ ఇచ్చాడు. అయితే వెజిటేబుల్ రైస్ రెండు స్పూన్లు తిన్న తర్వాత అందులో ఒక బొద్దింక కనిపించటంతో కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఆ రైస్‌లో బొద్ధింకతో పాటు అక్కడక్కడ వెంట్రుకలు కూడా కనబడటంతో రాజు, అతని కుటుంబ సభ్యులు వెంటనే ఆ ఫుడ్‌ను అక్కడే వదిలేశారు. వెంటనే ఆ ఫుడ్ ప్లేట్‌ను అక్కడి హోటల్ నిర్వాహకులకు చూపించి నిలదీయగా వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో రాజు వెంటనే ఫుడ్‌ సేఫ్టీ అధికారులకు కాల్‌ చేశాడు. అయితే, వారు కూడా స్పందించలేదని రాజు వాపోయాడు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి ఈ రెస్టారెంట్ పై చర్యలు తీసుకోవాలని రాజు డిమాండ్ చేశాడు. కల్తీ, అపరిశుభ్రత కారణంగా బయట ఏదైనా తినాలంటే భయంగా ఉందని బాధితుడు వాపోయాడు. ఇలాంటి ఘటనలు రోజూ ఎక్కడో చోట వెలుగు చూస్తున్నా.. సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు. దీంతో, హోటళ్ల యాజమాన్యాలు నాణ్యత, పరిశుభ్రతను పట్టించుకోవటం లేదు. ఈ కారణంగా ప్రజల ఆరోగ్యం ప్రమాదం పాలవుతోంది. ఈ తరహా సంఘటనలు చోటు చేసుకోవడంతో రెస్టారెంట్లకు హోటళ్లకు వెళ్లాలంటే వినియోగదారులు భయపడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తాగకపోతే దాహం, తాగితే రోగం 143 కృష్ణా గ్రామాల వారి ఆవేదన

సంక్రాంతికి రైల్వే టికెట్ బుకింగ్ కు ఇదే రైట్ టైమ్‌

సెంట్రల్‌ జైల్లో ఖైదీల రాజభోగాలు..!

RGV: చిరంజీవికి రామ్‌గోపాల్‌ వర్మ సారీ..!

పని ఒత్తిడి 10 మంది ప్రాణాలు తీసిన నర్స్