అర్ధరాత్రి దొంగల బీభత్సంఆ ఇళ్లే టార్గెట్‌

Updated on: Oct 15, 2025 | 6:57 PM

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. తాళం వేసిన ఇళ్లనే టార్గెట్‌ గా చేసుకుని లూటీకి పాల్పడుతున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా ధరూర్‌లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేసిన దొంగలు ఆదివారం అర్ధరాత్రి దాటాక నాలుగు ఇండ్లకు కన్నం వేసి అందిన కాడికి దోచుకుపోయారు.

గ్రామంలోని వేరు వేరు వార్డులలోని మంథని కవిత, షేక్ షబానా, ధ్యాగల నరేష్, శ్రీనివాస్ ఇళ్లలో ఒకే రోజు రాత్రి దొంగతనాలకు పాల్పడ్డారు. దొంగతనం జరిగిన తీరును బట్టి చూస్తే ముందుగానే దొంగలు.. గ్రామంలో పక్కాగా రెక్కీ నిర్వహించినట్లు అనుమానిస్తున్నారు. ఆదివారం రాత్రి విలేజ్‌లో పెళ్లి బరాత్ కూడా ఉండడంతో ఎవరికీ అనుమానం రాకుండా టార్గెట్ చేసిన ఇండ్ల తాళాలు పగలగొట్టి దొంగతనం చేశారు. సుమారు నలుగురైదురుగు ప్రణాళిక ప్రకారం ఈ దొంగతనాలకు పాల్పడినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఐదు ఇండ్లలో కలిపి సుమారు ఏడు తులాల బంగారం, వెండి 10 తులాలతో పాటు 2.7 లక్షలకు పైగా నగదు, రాజేశం అనే వ్యక్తి టూ వీలర్‌ను దొంగలు కాజేసినట్లు ప్రాథమికంగా తెలిసింది. ఇక ఘటనపై సమాచారం అందుకున్న జగిత్యాల రూరల్ పోలీసులు సోమవారం ఉదయం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ కెమెరాలను పరిశీలించారు. అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తండ్రి ఆశయం కోసం IPS సాధించిన ఫారిన్ విద్యార్థిని

మహావతార్‌లాగే.. కురుక్షేత్ర మూవీ OTTలో తప్పక చూడాల్సిందే

Srija: ఆయనే అలా చేస్తే ఎలా ?? సోషల్ మీడియాలో చర్చ

యూరప్ లో ప్రభాస్ ది రాజాసాబ్ సాంగ్ షూట్

ఆ విషయం లో పవన్‌ను ఫాలో అవుతున్న మలయాళ స్టార్‌