నేను ఐఏఎస్‌ను.. ఇన్‌ఛార్జి కలెక్టర్‌గా వచ్చాను
కామారెడ్డి కలెక్టరేట్‌లో నకిలీ ఐఏఎస్ అంశం కలకలం రేపింది. ఓ మహిళ తాను ఐఏఎస్‌నని, ప్రభుత్వం తనను అదనపు కలెక్టర్‌గా నియమించిందంటూ కలెక్టర్ కార్యాలయానికి వచ్చింది. తన నియామక పత్రాలంటూ కొన్ని కాగితాలనూ చూపిస్తూ.. తనను విధుల్లోకి చేర్చుకోవాలని కోరింది. అయితే, అప్పటికే అక్కడ అదనపు కలెక్టర్ విధుల్లో ఉండటంతో అధికారులకు అనుమానం వచ్చి.. వారు పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో నకిలీ కలెక్టర్‌ను పట్టుకుని ఆమెపై చీటింగ్ కేసు నమోదుచేశారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ నవంబరు 2వ తేదీ నుంచి సెలవులో ఉన్నారు. దీంతో నిజామాబాద్ కలెక్టర్‌కు ప్రభుత్వం ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించింది. నవంబర్ 4న హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన ఇస్రాత్ జహాన్ అనే మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి కామారెడ్డి కలెక్టరేట్‌కు వచ్చింది. తనను తాను ఐఏఎస్‌గా పరిచయం చేసుకుంది. సర్వే సెటిల్‌మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్‌లో కమిషనర్‌గా పని చేస్తున్నానని, ఆశిష్ సాంగ్వాన్ స్థానంలో ఇన్‌చార్జి కలెక్టర్‌గా తనను ప్రభుత్వం నియమించిందని ఉత్తర్వులను చూపింది. ఆ పత్రాలు అందుకున్న అక్కడి అధికారులు వాటిని అదనపు కలెక్టర్ మధుమోహన్‌కు పరిశీలనకు పంపి.. ఆమెను అక్కడే కూర్చోబెట్టారు. అయితే, కాసేపటి తర్వాత ఆ లేడీ కిలాడీ మెల్లగా అక్కడి నుంచి జారుకుంది. దీంతో, అనుమానం వచ్చిన ఏడీసీ.. పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించి ఆ మహిళను తూప్రాన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ జరిపారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ రాష్ట్ర కమిషనరేట్ నుంచి తనకు నియామకపత్రం వచ్చినట్లుగా చెప్పిందన్నారు. ఆమె 2020 నుంచి గ్రూప్స్‌కు సన్నద్ధమవుతోందని, తనకు ఉద్యోగం వచ్చినట్లు కుటుంబ సభ్యులను నమ్మించడానికే ఇలా చేసిందని వెల్లడించారు. దీంతో పోలీసులు ఆ మహిళపై చీటింగ్, ఫోర్జరీ కేసులను నమోదు చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆమె అప్పుడు హైదరాబాదీ.. ఇప్పుడు అమెరికాలో వర్జీనియా గవర్నర్
రియల్ ఎస్టేట్‌లో నయా ట్రెండ్.. పోతే రూ.వెయ్యి.. వస్తే ఇల్లు
నో ఫోటో షూట్, నో హగ్స్.. పెళ్లికొడుకు పది డిమాండ్లు ఇవే
పాన్‌కార్డ్ హోల్డర్స్‌కి కేంద్రం హెచ్చరిక
గుడికి వెళుతుండగా చైన్ స్నాచింగ్ సీసీటీవీ కెమెరాలో రికార్డ్
