అనుమానపు భర్తపై భార్య కన్నెర్ర.. చివరికి ఇలా..
కడప జిల్లా, పెండ్లిమర్రిలో దారుణం: భర్తను కిరాతకంగా చంపిన భార్య. అనుమానంతో, మద్యం మత్తులో నిత్యం వేధించే సిద్ధారెడ్డిని భార్య సుహాసిని గొడ్డలితో నరికి చంపింది. భరించలేని వేధింపులే హత్యకు దారితీశాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించి, కేసు నమోదు చేసి, నిందితురాలు సుహాసినిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి దర్యాప్తు కొనసాగుతోంది.
ఒకప్పుడు భార్యభర్తల బంధం ఎంతో పటిష్టంగా ఉండేది. కాపురంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, ఒకరినొకరు అర్థం చేసుకొని సర్దుకొనిపోయేవారు. కానీ ప్రస్తుతం కాలం మారింది. సర్దుకుపోదాం వెళ్లిపోయి చంపుకుపోదాం అన్నట్టుగా మారిపోయింది. మనుషుల్లో సహనం, దయ,కరుణలాంటివి తగ్గిపోతున్నాయా అనిపిస్తోంది ఈ ఘటన చూస్తే. అనుమానంతో వేధిస్తున్న భర్తను భరించలేకపోయిన భార్య కన్నెర్ర చేసింది. సహనం నశించి, కసితో కరడుగట్టిన మృగంలా మారి గొడ్డలితో కిరాతకంగా నరికి భర్తను హతమార్చింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమర్రి మండలం మల్లయ్య గారి పల్లెగ్రామానికి చెందిన సిద్ధారెడ్డి, సుహాసిని దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. స్థానికుల కథనం ప్రకారం.. సిద్ధారెడ్డి ప్రతిరోజూ మద్యం తాగి వచ్చి, భార్య ప్రవర్తనపై అనుమానంతో ఆమెను శారీరకంగా, మానసికగా వేధించేవాడు. రోజురోజుకూ ఈ వేధింపులు మితిమీరడంతో, భరించలేకపోయిన సుహాసిని తీవ్ర ఆవేశానికి లోనైంది. ఈ క్రమంలోనే ఇంట్లోని గొడ్డలిని తీసుకుని సిద్ధారెడ్డిపై దాడి చేసింది. గొంతు కోసి, అతి కిరాతకంగా నరికి చంపినట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే.. సిఐ చల్లని దొర, ఎస్ఐ తులసి నాగప్రసాద్ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న సిద్ధారెడ్డి మృతదేహాన్ని పరిశీలించి, క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితురాలు సుహాసినిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ హత్యకు గల పూర్తి కారణాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బొమ్మల కంపెనీ యజమాని ట్రంప్‌కు చుక్కలు చూపించాడు.!
ఇరాన్‌పై దాడులకుమా బేస్ వాడొద్దు ట్రంప్‌కు షాకిచ్చిన యూకే
రష్యా “కాంట్రాక్ట్ కిల్లింగ్’ వ్యూహం.. ఉక్రెయిన్‌కు పట్టుబడ్డ కిరాయి హంతకులు
స్పీడ్ రేసింగ్‌లో నాగచైతన్య.. టీమ్ కోసం రంగంలోకి అక్కినేని వారసుడు