Whatsapp Call: కొంపముంచిన వాట్సాప్‌ కాల్‌.. ఏం జరిగిందంటే ??

Updated on: Nov 18, 2025 | 7:19 PM

కడప జిల్లాలో సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోయి, రిటైర్డ్ MEO వీరారెడ్డిని 30 లక్షలు మోసగించారు. నకిలీ CBI అధికారులుగా వాట్సాప్ వీడియో కాల్ ద్వారా బెదిరించి డబ్బులు కాజేశారు. వేంపల్లి పోలీసులు దర్యాప్తు చేసి, సైబర్ ముఠాను పట్టుకున్నారు. ప్రజలు ఇలాంటి నకిలీ కాల్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని, పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ సూచించారు.

కడప జిల్లాలో సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోయారు. పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలానికి చెందిన రిటైర్డ్ ఎంఈవో వీరారెడ్డి అనే వ్యక్తి నుంచి 30 లక్షలు కాజేశారు. ఢిల్లీలో హ్యూమన్ ట్రాఫికింగ్, మనీ ల్యాండరింగ్ కేసు నమోదు అయిందని.. తాము సిబిఐ అధికారులం అని వాట్సాప్ వీడియో కాల్ ద్వారా సైబర్ ముఠా మాట్లాడింది. అరెస్ట్ చేయకుండా ఉండాలంటే డబ్బులు ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలని.. లేదంటే కఠిన చర్యలు తప్పవని, వీరారెడ్డిని అరెస్ట్ చేస్తామని బెదిరించారు. దీంతో అతను ఆ ముఠాకు 30 లక్షల రూపాయలు పంపించాడు. అంతటితో ఆగని ఆ సైబర్ క్రైమ్ ముఠా మళ్ళీ వేధింపులకు గురి చేయడంతో వీరారెడ్డి వేంపల్లి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు సైబర్ క్రైమ్ ముఠా గుట్టు రట్టు చేశారు. డబ్బులు పంచుకునే విషయంలో సైబర్ నేరగాళ్ళ మధ్య తలెత్తిన గొడవ కారణంగా ఈ నేరం బయటపడినట్లు తెలుస్తుంది. ఇటీవల ఇలాంటి కాల్స్‌ ఎక్కువయ్యాయని, వాట్సప్ కాల్ లో పోలీసుల ఫొటోలతో వస్తున్న కాల్స్ పై దృష్టి పెట్టాలని.. అలా ఎవరైనా కాల్స్ చేస్తే వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని జిల్లా ఎస్పీ సూచించారు. నేరాలు నమోదు అయితే పోలీసులు స్వయంగా వచ్చి వాటి వివరాలు తెలుపుతారని.. అంతేతప్ప ఇలా వాట్సాప్ ద్వారా వచ్చిన కాల్స్ గానీ.. మొబైల్స్ ద్వారా వచ్చిన కాల్స్ గాని ప్రజలు నమ్మవద్దని సూచించారు. ఇక ఈ కేసులో సైబర్ నేరగాళ్ల దగ్గర నుంచి 12 లక్షల పైచిలుకు నగదు, 17 సెల్ఫోన్లు, 13 బ్యాంక్ పాస్ బుక్కులు, 52 ఏటీఎం కార్డులు, 16 సిమ్ కార్డులు, 6 ఆధార్ కార్డులు, 6 చెక్ బుక్కులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు .. ఈ ముఠా సభ్యులంతా ముంబై, మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారుగా పోలీసులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Good News For Farmers : రైతులకు తీపికబురు.. నాలుగు రోజుల్లో

పోలీసులకే సవాల్ విసిరి.. చివరికి ఇలా

అమెజాన్‌ బెజోస్‌ రాకెట్‌తో అంగారకుడి పైకి వ్యోమనౌక

తల్లి చేసిన అద్బుతం కోమాలో నుంచి కూతురు బయటకు

చుట్టూ ఈదుతున్న చేపలు.. వాటి మధ్య లంచ్‌